📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs SA: సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం

Author Icon By Aanusha
Updated: November 14, 2025 • 9:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుతో (IND vs SA) జరిగిన మొదటి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత ‘ఏ’ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 285 పరుగులు చేయగా, భారత్ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ 129 బంతుల్లో 117 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read Also: Sanju Samson: CSKకి సంజూ శాంసన్!

రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా-ఏ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఇండియా-ఏ (IND vs SA) బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ లతో పాటు హర్షిత్ రాణా మెరుపు దాడికి దిగారు. అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆరంభపు స్పెల్స్ కారణంగా సఫారీ జట్టు కేవలం 1 పరుగుకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత 16 పరుగులకే నాలుగో వికెట్, 53 పరుగులకే సగం (5) వికెట్లు కోల్పోయింది.

ఈ విపత్కర పరిస్థితుల్లో డియాన్ ఫారెస్టర్ (77 పరుగులు), డెలానో పోట్‌గెటర్ (Delano Potgieter) కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. చివర్లో పోట్‌గెటర్ 90 పరుగులు చేయగా, బిజోర్న్ ఫార్టూయిన్ 59 పరుగులు జోడించి స్కోర్‌ను 285 పరుగులకు చేర్చడంలో ముఖ్యపాత్ర వహించారు.

తిలక్ వర్మతో కలిసి 89 పరుగుల భాగస్వామ్యం

286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా-ఏ జట్టుకు ఓపెనర్లు అభిషేక్ శర్మ (31), రియాన్ పరాగ్ (8) పెద్ద స్కోర్లు చేయకుండానే అవుటయ్యారు. అయితే, ఒక వైపు వికెట్లు పడుతున్నా రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ను నడిపించాడు.గైక్వాడ్ యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మతో కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

గైక్వాడ్ అద్భుతంగా ఆడి 117 పరుగులు చేసి అవుటయ్యాడు. అతని సెంచరీ భారత జట్టు విజయాన్ని దాదాపు ఖాయం చేసింది. చివరి ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు.

రెండో అనధికారిక వన్డే మ్యాచ్ నవంబర్ 16

ఒత్తిడిలో నితీశ్ కుమార్ రెడ్డి కేవలం 26 బంతుల్లో 37 పరుగులు చేసి, నిశాంత్ సింధుతో కలిసి 65 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. సింధు చివరి వరకు క్రీజులో నిలిచి 29 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో ఇండియా-ఏ జట్టు ఆఖరి ఓవర్లో 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య రెండో అనధికారిక వన్డే మ్యాచ్ నవంబర్ 16న జరగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

1st Unofficial ODI India A vs South Africa A latest news Rajkot Match Ruturaj Gaikwad Century Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.