Latest News: IND vs SA 3rd ODI: రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

Read Time:  1 min
Latest News: IND vs SA 3rd ODI: రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్
FONT SIZE
GET APP

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా (IND vs SA 3rd ODI) ఆఖరి సమరానికి సిద్దమైంది. (రేపు) శనివారం సాగర తీరం విశాఖపట్నం వేదికగా జరిగే డిసైడర్ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాంచీలో గెలిచి రాయ్‌పూర్‌లో ఓడిన భారత్.. వైజాగ్‌లో మళ్లీ విజయఢంకా మోగించాలని భావిస్తోంది.

Read Also: Andre Russell: IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

రెండో వన్డేలో 358 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన భారత్.. తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ (IND vs SA 3rd ODI) కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

తుది జట్లు (అంచనా)!

భారత్: కె.ఎల్. రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ధ్ కృష్ణ, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్.

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జీ, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సన్, కార్బిన్ బాష్, ప్రెనెల్లన్ సుబ్రియన్, ఆండ్రీ బెర్గర్, ఓట్నీల్ బార్ట్‌మన్, కేశవ్ మహారాజ్, లుంగి న్గిడి, రూబిన్ హర్మాన్.

సిరీస్ డిసైడర్ కావడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సొంతగడ్డపై భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా లేదా దక్షిణాఫ్రికా చరిత్ర తిరగరాస్తుందా అనేది వేచి చూడాలి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.