సౌత్ ఆఫ్రికాతో టీమ్ ఇండియా ఈ రోజు రెండో వన్డే (IND vs SA 2nd ODI) ఆడనుంది. మొదటి మ్యాచ్ ను గెలిచిన ఉత్సాహంలో రెండోది కూడా గెలిచి..సీరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది టీమిండియా. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్లను సమం చేసుకోవాలని చూస్తోంది. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (IND vs SA 2nd ODI) మధ్య రెండవ వన్డే ఈరోజు రాయ్‌పూర్‌లో జరుగుతుంది.
Read Also: Tilak Varma: రో-కోలు జట్టులో ఉంటే ఆత్మవిశ్వాసం వేరుగా ఉంటుందన్న తిలక్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ టెంబా బావుమా ఈ మ్యాచ్ కి, తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికా జట్టులో మూడు మార్పులు జరిగాయి. బావుమాతో పాటు, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి తిరిగి వచ్చారు.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), ఐడెన్ మార్క్‌రామ్, టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎన్గిడి.భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: