📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

IND vs PAK: ఓటమి పై పాక్ కెప్టెన్ సల్మాన్ ఏమన్నారంటే?

Author Icon By Aanusha
Updated: February 16, 2026 • 1:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ICC టీ20 ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్థాన్‌ (IND vs PAK) ను 61 పరుగుల తేడాతో ఓడించింది. టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. ఈ విజయంతో, భారత జట్టు సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడు విజయాలతో ఆ జట్టు గ్రూప్ A పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సల్మాన్ అఘా.. ‘ఈ రోజు మా స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

Read Also: Chandrababu Naidu : ఇషాన్‌పై చంద్రబాబు ప్రశంసలు, ఏమన్నారు?

సూపర్-8కు అర్హత సాధించడమే ఏకైక లక్ష్యం

ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయారు. అయితే మా స్పిన్నర్లపై మాకు నమ్మకం ఉంది. గత 6 నెలలుగా వారు అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్‌లో పవర్‌ప్లేలోనే మేము చాలా వికెట్లు కోల్పోయాం. అది మా పతనాన్ని శాసించింది. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ కొంచెం జిగటగా ఉంది. బంతి కూడా గ్రిప్ అయ్యింది. కానీ కండిషన్స్‌కు తగ్గట్లు మేం సరైన చోట బంతులు వేయలేకపోయాం. తొలి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు మెరుగ్గా సహకరించింది.

IND vs PAK: What did Pakistan captain Salman say about the defeat?

ఇలాంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌ల్లో భావోద్వేగాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. మేం ఇప్పటికే ఇలాంటి మ్యాచ్‌లు చాలా ఆడాం. ఇక రెండు రోజుల్లోనే మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ ఓటమిని మరిచి దానిపై దృష్టి పెట్టాలి. ఆ మ్యాచ్‌లో గెలిచి సూపర్-8కు అర్హత సాధించడమే మా ముందున్న ఏకైక లక్ష్యం. అక్కడి నుంచి మళ్లీ ఒక కొత్త టోర్నమెంట్ మొదలవుతుంది.’అని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ICC T20 World Cup 2026 India vs Pakistan latest news Pakistan captain Salman Ali Agha Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.