📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

IND vs PAK: ఈ విజయం భారత్‌ కు అంకితం: సూర్యకుమార్ యాదవ్

Author Icon By Aanusha
Updated: February 16, 2026 • 1:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్ (IND vs PAK) 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సూపర్-8 బెర్త్‌ను దక్కించుకోవడంతో పాటు పాక్‌పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మార్చుకుంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

Read Also: Chandrababu Naidu : ఇషాన్‌పై చంద్రబాబు ప్రశంసలు, ఏమన్నారు?

ఈ విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అద్భుతమని కొనియాడిన సూర్య.. బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారని ప్రశంసించాడు. ‘ఈ విజయం యావత్ భారత్‌కు అంకితం. మేం ఏ తరహా క్రికెట్ అయితే ఆడాలనుకున్నామో.. అదే ఆట ఆడాం. ఇషాన్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం.గత కొన్ని మ్యాచ్‌లతో పాటు దేశవాళీ క్రికెట్‌లో ఎలా ఆడాడో అదే ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగించాడు.

IND vs PAK: This victory is dedicated to India: Suryakumar Yadav

తదుపరి ప్రయాణం గురించి రేపు ఆలోచిస్తాం

జట్టు స్కోరు 0-1 వద్ద ఉన్నప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. ఇషాన్ ఆ పనిని అద్భుతంగా పూర్తి చేశాడు. బ్యాటింగ్‌లో మిడిల్ ఓవర్లలో కొంచెం తడబడ్డాం. కానీ టీ20 క్రికెట్ బ్యూటీనే అది. తిలక్, దూబే, రింకూ బ్యాటింగ్ చేసిన తీరు మెచ్చుకోదగ్గది.ముందుగా బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంత స్కోరు సరిపోతుందో అంచనా వేయడం కష్టం. కానీ మేం 175 పరుగులు చేయగానే 15-20 పరుగులు ఎక్కువే చేశామని అనిపించింది.

ఒకవేళ 155 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉండేది. హార్దిక్ కొత్త బంతితో బాధ్యత తీసుకున్నాడు. బుమ్రా తనేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలరో మరోసారి నిరూపించాడు.జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించడం చూడముచ్చటగా ఉంది. ఇక మా తదుపరి ప్రయాణం గురించి రేపు ఆలోచిస్తాం. ఈ రాత్రి జట్టుతో కలిసి ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటాం. ఆపై అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత తదుపరి వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం.’అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

abhishek sharma ICC T20 World Cup 2026 Ishan Kishan latest news Suryakumar Yadav Team India Captain Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.