భారత్, పాకిస్థాన్ (IND vs PAK) క్రికెట్ జట్ల మధ్య మైదానంలో దూరం కొనసాగుతోంది. తాజాగా అండర్-19 మెన్స్ ఆసియా కప్‌లోనూ భారత జట్టు పాకిస్థాన్‌తో ‘నో షేక్ హ్యాండ్’ విధానాన్ని అనుసరించింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, పాక్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ కనీసం కరచాలనం చేసుకోలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండానే టాస్ ప్రక్రియను ముగించి, తమ డ్రెస్సింగ్ రూమ్‌లకు వెళ్లిపోయారు.
Read Also: Lionel Messi: ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ
హై వోల్టేజ్ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు
మ్యాచ్‌లో (IND vs PAK) పాకిస్తాన్ అండర్ – 19 కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఆయుష్ మాత్రే నాయకత్వంలోని భారత్ అండర్ – 19 జట్టు ఈ మ్యాచ్‌కు ముందు యూఏఈపై 234 పరుగుల భారీ విజయం సాధించింది.

ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 95 బంతుల్లో 171 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగులకే అవుటై నిరాశ పరిచాడు.సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: