భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అత్యధిక వన్డేలు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమించి ముందుకు దూసుకెళ్లారు. భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో (IND vs NZ) కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఇది కోహ్లీకి 309వ వన్డే కాగా.. సౌరవ్ గంగూలీ 308 వన్డేలు ఆడాడు.
Read also: India vs New Zealand: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
పలు రికార్డు లు సొంతం
ఓవరాల్‌గా ఈ జాబితాలో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్(463) టాప్‌లో ఉన్నారు. ఇతర భారత ప్లేయర్లు ధోనీ(347), ద్రవిడ్(340), అజహరుద్దీన్(334) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సుదీర్ఘ కాలం నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటికే ఎన్నో ఘనతలను సాధించాడు.
అత్యధిక వన్డే సెంచరీలు బాదిన బ్యాటర్‌గాను రికార్డ్ అందుకున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగితే మహమ్మద్ అజారుద్దీన్(334) రికార్డ్‌ను అధిగమించే అవకాశం ఉంది. కొత్త ఏడాది టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్, మ్యాచ్ ఇదే కావడంతో విజయం సాధించాలనే పట్టుదలతో భారత్ ఉంది. గెలుపుతో ఈ ఏడాదిని ప్రారంభించాలనుకుంటుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: