న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఓటమి పాలైన నేపథ్యంలో, వికాస్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా చేసిన సెటైరికల్ పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్ట్ నేరుగా మంజ్రేకర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టుగా క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్‌గా గుర్తింపు పొందిన సంజయ్ మంజ్రేకర్‌పై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
Read Also: WPL 2026: RCBతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్
సర్వత్రా విమర్శలు
విరాట్ కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఎంచుకున్నాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. తన లోపాలను సరిదిద్దుకోకుండా టెస్ట్‌లకు వీడ్కోలు పలికాడని అభిప్రాయపడ్డాడు. జోరూట్, విలియమ్సన్, స్మిత్.. టెస్ట్ క్రికెట్‌లో రాణిస్తుంటే కోహ్లీ మాత్రం సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడని తక్కువ చేసి మాట్లాడాడు.
విరాట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినా బాగుండేదని,
టాపార్డర్ బ్యాటర్‌కు ఎంతో సులువైన వన్డేల్లో కొనసాగడం తనను మరింత నిరాశకు గురి చేసిందన్నాడు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వికాస్ కోహ్లీ కూడా సంజయ్ మంజ్రేకర్ పేరు ప్రస్తావించుకుండా ఘాటుగా బదులిచ్చాడు. ‘కొందరికి కోహ్లీ పేరు ఎత్తకపోతే పూట గడవదు అన్నట్లుగా ఉంది పరిస్థితి’అని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ థ్రెడ్స్‌లో పోస్ట్ పెట్టాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: