📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

IND vs NZ: టాస్ గెలిచిన టీమిండియా

Author Icon By Aanusha
Updated: January 23, 2026 • 7:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూజిలాండ్‌తో (IND vs NZ) జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0తో లీడ్‌లో నిలిచింది. రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కివీస్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా రాత్రి 7 గంటల నుంచి వీక్షించొచ్చు.

Read Also: AP: సైనా నెహ్వాల్‌పై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు

బుమ్రాకు విశ్రాంతి

డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఈ మ్యాచ్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించామని చెప్పిన సూర్య.. గాయంతో అక్షర్ పటేల్ దూరమయ్యాడని పేర్కొన్నాడు.మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇక్కడ అప్పుడే మంచు కురుస్తోంది. మేం ఈ మధ్య కాలంలో లక్ష్యాన్ని ఛేజ్ చేయలేదు. అందుకే ఇప్పుడు ఛేజింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ చూడటానికి బాగుంది.

మేం ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ.. అన్ని విభాగాల్లో మెరుగవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో కూడా అన్ని రంగాల్లో అలాగే రాణించడానికి ప్రయత్నిస్తాం. మా తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అక్షర్ పటేల్‌కు గత మ్యాచ్‌లో గాయమైంది. బుమ్రాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పిచాం.’అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేయాలనుకున్నామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. ‘మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం.

IND vs NZ: Team India wins the toss

ప్రతీసారి ఎంతో కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది

మైదానంలో అప్పుడే మంచు కురుస్తుంది. పరిస్థితి మాకేమి అంత అనుకూలంగా మారుతుందని నేను అనుకోవడం లేదు. స్వదేశీ పరిస్థితుల్లో ఇలాంటి నాణ్యమైన జట్టుతో ఆడుతున్నప్పుడు, ప్రతీసారి ఎంతో కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది.మేం కూడా నేర్చుకున్నాం. ముఖ్యంగా భారత బ్యాటర్లు ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డారు. బౌలింగ్‌లో మేం ఏం చేయాలో ఇప్పుడు మాకు అర్థమైంది.

మా ప్రణాళికల విషయంలో మేం మరింత స్పష్టంగా ఉండి, వారిని కట్టడి చేయడానికి ప్రయత్నించాలి. మా జట్టులో మూడు మార్పులు జరిగాయి. రాబర్ట్‌సన్ స్థానంలో సీఫెర్ట్, క్రిస్టియన్ క్లార్క్ స్థానంలో జక్ ఫోల్క్స్, జేమీసన్ స్థానంలో మాట్ హెన్రీ జట్టులోకి వచ్చారు.’అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు

న్యూజిలాండ్‌ తుది జట్టు: కాన్వే, టిమ్‌ సీఫర్ట్‌, రచిన్‌ రవీంద్ర, గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్‌, డారిల్‌ మిచెల్‌, మిచెల్‌ శాంట్నర్‌, టామ్‌ ఫౌక్స్‌, మ్యాట్‌ హెన్రీ, ఇష్‌ సోధి, లాకీ ఫెర్గుసన్‌ (డఫీ) చోటు దక్కించుకున్నారు.

భారత్‌ ప్లేయింగ్‌ XI: సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, రింకూ సింగ్‌, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News ind vs nz latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.