టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు.టీ20 వరల్డ్ కప్‌కు ముందు లభించిన అద్భుతమైన అవకాశాలను సంజూ చేజార్చుకుంటున్నాడు. న్యూజిలాండ్ (IND Vs NZ) తో నిన్న జరిగిన నాలుగో టీ20లో మంచి ఆరంభం లభించినా, దాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న సంజూ శాంసన్.. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు.
Read Also: Sports: ఏపీ ప్రభుత్వానికి అథ్లెట్ జ్యోతి యర్రాజీ కృతజ్ఞతలు
ఇది రెండోసారి ఇలా జరగడం
సంజూ శాంసన్ స్కోర్లు వరుసగా 10,8,0, 24 మాత్రమే చేశాడు. ముఖ్యంగా నాలుగో మ్యాచ్ (IND Vs NZ)లో క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినప్పటికీ.. భారీ స్కోరు చేయలేకపోయాడు. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం సంజూ శాంసన్‌పై నమ్మకంతో శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టినప్పటికీ.. సంజూ శాంసన్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. కామెంటరీలో గవాస్కర్ మాట్లాడుతూ.. “నాకు మొదట అనిపించింది ఏంటంటే, అతడికి ఫుట్‌వర్క్ ఏమాత్రం లేదు.
బంతి ఏమైనా టర్న్ అయిందో లేదో కచ్చితంగా తెలియదు. కానీ, అతను అక్కడే నిలబడి, ఆఫ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు” అని విశ్లేషించాడు. సంజూ పదేపదే ఇదే తరహాలో ఔటవుతున్నాడని గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. “చెప్పినట్టుగానే, కాళ్ల కదలిక దాదాపుగా లేదు. లెగ్-స్టంప్ బయటకు వెళ్లి, మూడు స్టంప్‌లు బౌలర్‌కు కనిపించేలా చేశాడు. అలాంటప్పుడు బంతి మిస్ అయితే బౌలర్ స్టంప్‌లను కొడతాడు. సంజూ శాంసన్‌కు ఇది రెండోసారి ఇలా జరగడం” అని గవాస్కర్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: