📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. మరోసారి మూడు మార్పులతో భారత్

Author Icon By Divya Vani M
Updated: October 28, 2024 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్‌ టెస్ట్ సిరీస్ గెలవడం భారత క్రికెట్ చరిత్రలో ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు. టీమిండియా సొంతగడ్డపై ఎన్నో విజయాలు సాధించినా, ఈ సిరీస్‌లో బ్యాటర్ల తడబాటు వలన బెంగళూరు, పూణే టెస్టుల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఈ పరాజయంతో టీమిండియాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది ముంబైలో జరుగబోయే మూడో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ నిర్ణయాత్మక మూడో టెస్టులో టీమ్ మేనేజ్‌మెంట్‌ కచ్చితమైన మార్పులను చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా, రెండు టెస్టుల్లో విఫలమైన కొన్ని విభాగాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.

రెండో టెస్టులో కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతి ఇవ్వడం జరిగింది. వారి స్థానాల్లో గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ చోప్రాలను తీసుకురావడం జరిగిందన్న విషయం తెలిసిందే. అయితే ఈ మార్పులు కూడా టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో చివరి టెస్టులో విజయం సాధించి పరువు కాపాడుకోవడమే టీమిండియా ప్రధాన లక్ష్యం ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని కూడా యోచిస్తోంది. రిషబ్ పంత్ మొదటి టెస్టులో గాయపడినా, రెండో టెస్టులో ఆడాడు. అతనికి మరింత విశ్రాంతి ఇచ్చే ఉద్దేశంతో, చివరి టెస్టులో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొదటి రెండు టెస్టుల్లో రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌ లాంటి ముగ్గురు స్పిన్నర్లు ఆడారు. కానీ మూడో టెస్టులో అక్షర్ పటేల్‌కు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. జడేజాకు విశ్రాంతి ఇచ్చి, అతడి స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. అలాగే, మొదటి టెస్టులో అంతగా ప్రభావం చూపని మహమ్మద్ సిరాజ్‌ను రెండో టెస్టుకు పక్కన పెట్టినా, మూడో టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి సిరాజ్‌ను తీసుకురావాలని యోచిస్తున్నారు ఈ మ్యాచ్‌లో విజయమే భారత జట్టు పరువు నిలుపుకునే మార్గం కావడంతో, అన్ని మార్గాల్లో సమర్థత చూపించి గెలవాలని టీమిండియా ప్రయత్నిస్తోంది.

Axar Patel in Playing XI Cricket Team Changes India Cricket Team India Test Match Strategy Indian Cricket News Indian Spinners Jasprit Bumrah Rest Mohammad Siraj Rested Mumbai Test Match New Zealand Victory Rishabh Pant Injury Team India Performance

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.