IND vs NED: అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ – 2026లో భాగంగా భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే భారత్ సూపర్ 8కు చేరుకుంది. ఇరు జట్ల మధ్య 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, ముందుగా బోర్డుపై పరుగులు పెట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావాలన్నది తమ వ్యూహమని తెలిపాడు.
Read Also: JammuKashmir Cricket: చారిత్రక ఘనత.. జమ్ము కశ్మీర్ తొలి రంజీ ఫైనల్
జట్టులో ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణిస్తున్నారని, ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటుండటం శుభపరిణామమని పేర్కొన్నాడు.ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు మార్పులు చేసినట్లు సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను, అక్షర్ పటేల్‌కు విశ్రాంతి ఇచ్చి ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.
మరోవైపు నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ, తాము టాస్ గెలిచి ఉంటే బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. ఈ టోర్నమెంట్‌లో తమ ప్రస్థానాన్ని మంచి ప్రదర్శనతో ముగించాలనుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
జట్లు
భారత్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
నెదర్లాండ్స్: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ’డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్/వికెట్ కీపర్), జాక్ లయన్-కాచెట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, నోవా క్రోస్.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: