IND Vs ENG: ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్‌లో గెలిచి ఫైనల్‌కు చేరడంపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగంగా స్పందించారు. “భారత్‌లో ఆడుతూ.. ఇంతటి గొప్ప జట్టుకు నాయకత్వం వహించి వరల్డ్ కప్ ఫైనల్ చేరడం ఒక అద్భుతమైన అనుభూతి. మా ఆటగాళ్లందరికీ ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం” అని ఆయన పేర్కొన్నారు. స్పష్టమైన అవగాహనతో సంజూ శాంసన్ బ్యాటింగ్ చేశాడు. వికెట్ పడినా సరే.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని గ్రహించి దూకుడుగా ఆడాడు. జట్టుకు సరిగ్గా అలాంటి ఇన్నింగ్సే అవసరం.
Read Also: MS Dhoni Viral Video: నెట్టింట వైరల్ అవుతున్న ధోనీ ఫన్నీ మూమెంట్
సంజూ.. బుమ్రా అసాధారణ బౌలింగ్!
గత ఏడాది కాలంగా తను పడుతున్న కష్టానికి ఈరోజు తగిన ప్రతిఫలం దక్కింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసిన తీరును చూసి.. ‘ఓ మై గాడ్! మీపై గెలవాలంటే మేం ఇంకెన్ని పరుగులు చేయాలి?’ అని హ్యారీ బ్రూక్‌తో అన్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఇంగ్లండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆఖరి వరకు వారు మ్యాచ్‌లోనే ఉన్నారు. కానీ జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ఇతర బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను మావైపు తిప్పారు. బుమ్రా సామర్థ్యం ఏంటో.. ఇన్నేళ్లుగా భారత్ కోసం తను ఏం చేశాడో మనందరికీ తెలుసు.
ఇంగ్లాండ్ ఆటతీరుపై సూర్య సరదా వ్యాఖ్యలు
ఈరోజు మళ్ళీ అదే చేశాడు. ఇంగ్లండ్ లక్ష్య ఛేదనలో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆ సమయంలో ఎవరైనా నా హార్ట్ రేట్ చూసి ఉంటే అది ఖచ్చితంగా 160-175 మధ్యలో ఉండేది. కానీ అది ఆటలో భాగం. ఇదొక అద్భుతమైన సెమీ ఫైనల్. ఇప్పుడు ఫైనల్‌కు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేం వార్మప్ కోసం వచ్చినప్పుడే స్టేడియం ప్రేక్షకులతో 75-80 శాతం నిండిపోయింది.భారత్ గెలవాలని వారు ఎంతగా కోరుకుంటున్నారో అర్థమవుతుంది. ఫైనల్ ముందు వారికి ఒక గొప్ప ఆటను అందించామని అనుకుంటున్నా. భారత్‌లో ఫైనల్ ఆడటం ఖచ్చితంగా ఒత్తిడిని కలిగిస్తోంది. కానీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు.’అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: