📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IND vs ENG Semifinal: వాంఖడేలో సెమీస్ సెగ.. భారత్‌ను ‘సైలెంట్’ చేస్తామంటున్న సామ్ కరన్

Author Icon By Anusha
Updated: March 4, 2026 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IND vs ENG Semifinal: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. గురువారం ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ టీమ్ భారత జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు.. ముంబైలో హోరెత్తే లక్షలాది మంది అభిమానులను సైలెంట్ చేసే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, ఇండియాను ఓడిస్తేనే వారు సైలెంట్ గా కూర్చుంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అభిషేక్ శర్మను ఔట్ చేయడానికి తమ దగ్గర ‘రామబాణం’ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Read Also: ICC Women’s ODI Rankings 2026: వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి నంబర్ వన్

సూర్యసేనకు పరోక్షంగా హెచ్చరికలు

వాంఖడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌గా పేరుగాంచింది. దీనిపై స్పందిస్తూ.. ఈ సెమీఫైనల్ మ్యాచ్ కూడా హై-స్కోరింగ్ పోరుగా నిలుస్తుందని సామ్ కరన్ అంచనా వేశారు. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉన్నందున సిక్సర్ల వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది. “మేము ఎవరికీ భయపడము, ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఉత్సాహంతో ఉంది” అని సామ్ కరన్ సూర్యసేనకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు.

IND vs ENG Semifinal: Semis at Wankhede.. Sam Curran says India will be ‘silent’

సామ్ కరన్ చేసిన ఈ కామెంట్స్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ను గుర్తు చేస్తున్నాయి. నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లక్ష మందికి పైగా ఉన్న భారత అభిమానులను నిశ్శబ్దంగా మార్చడమే తన లక్ష్యమని చెప్పి.. అన్నంత పని చేసి కప్పును ఎగరేసుకుపోయాడు. ఇప్పుడు అదే తరహాలో సామ్ కరన్, “గురువారం వాంఖడే స్టేడియం నిశ్శబ్దంగా మారుతుందని నాకు నమ్మకం ఉంది” అని పేర్కొన్నాడు. స్టేడియంలో నిశ్శబ్దం నెలకొందంటే దాని అర్థం ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శిస్తోందని సామ్ కరన్ ధీమా వ్యక్తం చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

IND vs ENG Semifinal Sam Curran Comments on Abhishek Sharma Wankhede Stadium T20 World Cup

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.