📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IND vs ENG: కోహ్లీ రికార్డు సమం చేసిన సంజూ శాంసన్

Author Icon By Aanusha
Updated: March 6, 2026 • 12:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IND vs ENG: భారత ఓపెనర్ సంజూ శాంసన్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తూ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానంలో సెమీఫైనల్ మ్యాచ్‌లో సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడిని అధిగమించి, అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి భారత ఓపెనర్‌గా ఆయన నిలిచాడు.

Read Also: India vs England : దుమ్మురేపిన టీమిండియా..ఇంగ్లండ్ కు 254 టార్గెట్

89 పరుగులతో రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్

ఈ కీలక మ్యాచ్‌లో సంజూ శాంసన్ కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆయన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 కళ్లు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. కేవలం బౌండరీల రూపంలోనే ఎక్కువ పరుగులు రాబట్టిన సంజూ, భారత జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో సంజూకు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం.

IND vs ENG: Sanju Samson equals Kohli’s record

కోహ్లీ 2016 రికార్డు సమం

వెస్టిండీస్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసిన సంజూ శాంసన్.. తాజా మ్యాచ్‌లోనూ అదే జోరు కనబర్చాడు. దాంతో విరాట్ కోహ్లీ పేరిట గత 10 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డ్‌ను సమం చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఇదే వాంఖడే మైదానం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ 89 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లోనూ సంజూ శాంసన్ సరిగ్గా 89 పరుగులే చేసి విరాట్ కోహ్లీ రికార్డ్‌ను సమం చేశాడు.

ఓవరాల్‌గా ఐసీసీ టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. బుధవారమే సౌతాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్(34 బంతుల్లో 100 నాటౌట్) అజేయ సెంచరీతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజా మ్యాచ్‌తో సంజూ శాంసన్ ఈ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

India vs England Semifinal Sanju Samson T20 World Cup 2026 Virat Kohli Record

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.