భారత మహిళా క్రికెట్ జట్టు మరో సారి సామాజిక చైతన్యానికి నాంది పలికే వినూత్న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) లో శనివారం జరగబోయే ఆస్ట్రేలియాతో చివరి వన్డే (ODI) లో టీమిండియా మహిళల జట్టు పింక్ కలర్ జెర్సీతో క్రీడాభిమానుల ముందుకు రాబోతోంది. ఈ ప్రత్యేక జెర్సీ వెనుక ఉన్న కారణం మాత్రం క్రికెట్ కంటే పెద్దది – రొమ్ము క్యాన్సర్ అవగాహన.
ఈ నిర్ణయాన్ని బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటిస్తూ, తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రతీకా రావల్, స్నేహ్ రాణా లాంటి ప్రముఖ ఆటగాళ్లు పింక్ జెర్సీ (Pink jersey) లో కనిపించి, అభిమానులకు సందేశం అందించారు. రొమ్ము క్యాన్సర్ సమస్యపై సమాజంలో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని బీసీసీఐ స్పష్టం చేసింది.
క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలకు మద్దతుగా
అయితే, ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తదితర ఫ్రాంచైజీలు సైతం క్యాన్సర్ (Cancer) అవగాహన కార్యక్రమాలకు మద్దతుగా ప్రత్యేక కిట్‌లో కనిపించాయి.ఇదిలా ఉండగా.. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) జట్లు 1-1తో సమయంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ సెప్టెంబర్ 30 వుమెన్స్ వరల్డ్ కప్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కీలక టోర్నీకి ముందు సన్నాహకంగా ఉపయోగపడనున్నది.
భారత పేస్ అటాక్, టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌తో సిరీస్‌లో బాగానే రాణించింది. కానీ, మిడిల్ ఆర్డర్ ఆందోళన కలిగిస్తున్దని. బలంగా ఉన్న ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్‌పై అద్భుతంగా రాణించి హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని జట్టు ప్రపంచకప్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. మరో వైపు ఆస్ట్రేలియా సైతం ఈ సిరీస్‌ను నెగ్గి ప్రపంచకప్‌కు ముందు భారత్‌పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: