📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs AUS: ఐదో టీ20కి వర్షం అంతరాయం

Author Icon By Anusha
Updated: November 8, 2025 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తుది పోరాటం గబ్బా వేదికగా ఉత్కంఠభరితంగా సాగుతోంది. కానీ మధ్యలోప్రతికూల వాతావరణం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేసారు. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్..  వర్షంతో ఆట నిలిపివేసే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది.

Read Also: Cheteshwar Pujara: షారుఖ్ ఖాన్‌పై మాజీ ప్లేయర్ భార్య ప్రశంసలు

ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లతో 29 బ్యాటింగ్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23) దూకుడుగా ఆడారు.బెన్ ద్వార్షూయిస్ వేసిన తొలి ఓవర్‌లోనే ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను గ్లేన్ మ్యాక్స్‌వెల్ నేలపాలు చేశాడు.

బౌండరీలు బాదేందుకు అభిషేక్ కాస్త ఇబ్బంది పడినా శుభ్‌మన్ గిల్ (Shubhman Gill), క్లాస్ బ్యాటింగ్‌తో బౌండరీలు బాదాడు. ద్వార్షూయిస్ మరుసటి ఓవర్‌లో నాలుగు బౌండరీలు బాదాడు.ఇక నాథన్ ఎల్లిస్ వేసిన నాలుగో ఓవర్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఇచ్చిన క్యాచ్‌ను ద్వార్షూయిస్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అభిషేక్ శర్మ ఓ భారీ సిక్స్ బాదాడు.

IND vs AUS

అభిషేక్ శర్మ భారీ సిక్స్

దాంతో అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు చేసుకున్నాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ 528 బంతుల్లోనే 1000 పరుగులు సాధించాడు. ఇందుకు అతను 28 ఇన్నింగ్స్‌లు ఆడాడు. కోహ్లీ (Kohli) మాత్రం 27 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేసి టాప్ ఇండియా బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.

స్టేడియం స్కోర్‌బోర్డుపై హెచ్చరికలు ప్రదర్శించారు

భద్రతా కారణాల దృష్ట్యా, స్టేడియంలోని ముందు వరుసల్లో ఉన్న ప్రేక్షకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. “బహిరంగ ప్రదేశాల్లో ఉండటం సురక్షితం కాదు. దయచేసి సురక్షిత ఆశ్రయం పొందండి” అని స్టేడియం స్కోర్‌బోర్డుపై హెచ్చరికలు ప్రదర్శించారు.

వాతావరణ రాడార్ ప్రకారం గంట పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే, ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. దీంతో సిరీస్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Breaking News Gabba T20 2025 IND vs AUS 5th T20 latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.