📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs AUS: మెరిసిన హర్షిత్ రాణా

Author Icon By Anusha
Updated: October 25, 2025 • 2:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిడ్నీ (Sydney) వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపారు.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కీలకమైన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 236 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు లైన్, లెంగ్త్‌పై అపూర్వ నియంత్రణ కనబరుస్తూ ఆసీస్ బ్యాటర్లను ఒక్కొక్కరిని పెవిలియన్‌కి పంపారు.

IND vs AUS: క్యాచ్ పట్టాడు.. గ్రౌండ్ లో పడిపోయాడు

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రేన్‌షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(41), మాథ్యూ షార్ట్(30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీయగా.. వాషింగ్టన్ సుందర్(2/44) రెండు వికెట్లు పడగొట్టాడు.

ఆసీస్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్(29), మిచెల్ మార్ష్(41) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన అనంతరం సిరాజ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి పవర్ ప్లేలో ఆసీస్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. అనంతరం మాథ్యూ షార్ట్‌తో కలిసి మిచెల్ మార్ష్ (Michelle Marsh) ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు.

IND vs AUS

హర్షిత్ రాణా ఔట్ చేయగా

కానీ హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే మాథ్యూ షార్ట్(30)ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయగా.. అలెక్స్ క్యారీ(24)ని శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్‌ క్యాచ్‌తో హర్షిత్ రాణా ఔట్ చేశాడు. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో అయ్యర్‌ పక్కటెముకలకు తీవ్ర గాయమైంది.

ఓవైపు వికెట్లు పడినా మరోవైపు మ్యాచ్ రేన్‌షా 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే మిచెల్ ఓవెన్‌ను హర్షిత్ రాణా ఔట్ చేయగా.. మిచెల్ స్టార్క్‌ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నాథన్ ఎల్లిస్(16)ను ప్రసిధ్ కృష్ణ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

ఆడమ్ జంపాతో కలిసి కూపర్ కాన్లీ కాసేపు పోరాడాడు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో బౌండరీలు రాబట్టాడు. అతనితో పాటు జోష్ హజెల్ వుడ్(0)ను ఔట్ చేసిన హర్షిత్ రాణా ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News final odi Harshit Rana India vs Australia latest news matt renshaw Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.