📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs AUS: నాలుగో టీ20.. టాస్ ఓడిన టీమిండియా

Author Icon By Anusha
Updated: November 6, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో టీ20లో (IND vs AUS) టీమిండియా టాస్ ఓడింది.. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం ద్వారా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని మార్ష్ స్పష్టం చేశాడు. సిరీస్‌లో ఇప్పటికే రెండు జట్లు సమంగా పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది.

Read Also: Arundhati Reddy: మా అమ్మకు మీరే హీరో మోది జీ సార్

జ‌ట్టులో మార్పులు చేయ‌లేని కెప్టెన్ సూర్య చెప్పాడు. మ‌రో వైపు ఆస్ట్రేలియా జ‌ట్టులో నాలుగు మార్పులు జ‌రిగాయి. జంపా, డ్వారిష‌స్‌, మ్యాక్స్‌వెల్‌, ఫిలిఫ్ జ‌ట్టులోకి వ‌చ్చిన‌ట్లు ఆసీస్ కెప్టెన్ మార్ష్ తెలిపారు.ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ (T20 series) ప్రస్తుతం 1-1తో సమమైన నేపథ్యంలో సిరీస్‌ దక్కించుకోవాలంటే ఇరు జట్లు తప్పకగెలువాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

టీ20 (IND vs AUS) ప్రపంచకప్‌ టోర్నీ సమీపిస్తున్న వేళ ప్రతీ సిరీస్‌ కీలకమైన క్రమంలో రెండు జట్లు తమ విన్నింగ్‌ కాంబినేషన్‌ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. డాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌శర్మ మంచి ఫామ్‌మీదుండటం జట్టుకు కలిసి రానుండగా, గిల్‌ నిలకడలేమి జట్టును ఆందోళనకు గురి చేస్తున్నది.

 IND vs AUS

గిల్‌ టీ20ల్లో అంతగా రాణించలేకపోతున్నాడు

భవిష్యత్‌ ఆల్‌ఫార్మాట్‌ కెప్టెన్‌గా భావిస్తున్న గిల్‌ టీ20ల్లో అంతగా రాణించలేకపోతున్నాడు. జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 37, 5, 15 స్కోర్లతో నిరాశపరిచాడు. గిల్‌పై భారీ ఆశలు పెట్టుకున్న టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అందుకు తగ్గట్లు అవకాశాలు ఇస్తూపోతున్నది.

మూడో టీ20లో వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) తో పాటు లోయార్డర్‌లో జితేశ్‌శర్మ రాణించడం టీమ్‌ఇండియాకు కలిసొచ్చింది. ఇన్ని రోజులు ఫామ్‌లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గాడిలో పడటం జట్టుకు ఊరటనిచ్చే అంశం.

తుది జట్లు:

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, గ్జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

India vs Australia 4th T20 latest news Mitchell Marsh toss t20 cricket Team India Batting Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.