
ఆస్ట్రేలియాతో (IND vs AUS) జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా జట్టు రెండో వికెట్‌ను కోల్పోయింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ప్రారంభంలో ఓపెనర్లు బాగానే ఆరంభం ఇచ్చారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది వన్‌డౌన్‌లో వచ్చిన ఆల్‌రౌండర్ శివం దూబే (Shivam Dube) ఔటయ్యాడు.
Read Also: IND vs AUS: నాలుగో టీ20.. టాస్ ఓడిన టీమిండియా
నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో దూబే 22 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో ఓ ఫోర్, సిక్సర్ ఉన్నాయి. దూబే ఓ భారీ సిక్సర్ కొట్టాడు. జంపా (Adam Zampa) వేసిన బౌలింగ్‌లో అతను బంతిని స్టేడియం బయటకు కొట్టాడు. దీంతో కొత్త బంతిని తీసుకువచ్చారు. ఆ సిక్సర్‌కు చెందిన వీడియోను వీక్షించండి.
దీనికి ముందు ఓపెనర్ అభిషేక్ శర్మ 6.4 ఓవర్ల వద్ద 28 పరుగుల వ్యక్తిగత స్కోరుకు ఔటయ్యాడు. అభిషేక్ 21 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 28 రన్స్ చేశాడు. ప్రస్తుతం ఇండియా 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 90 రన్స్ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: