IND vs AFG 2026 Schedule: ఈ ఏడాది జూన్ నెలలో భారత గడ్డపై అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేల (ODI) సిరీస్ జరగనుంది. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ భారత జట్టుకు నాయకత్వం వహించబోతుండటం విశేషం. టెస్ట్ మ్యాచ్‌లో గిల్ సారథ్యంలో భారత్ ఎలా రాణిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Kadiyam Srihari: వరంగల్‌లో కొత్త క్రికెట్ స్టేడియం
వన్డేల్లో రోహిత్, కోహ్లీల రీ-ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు పండగే!
టెస్ట్ మ్యాచ్‌కు కొంతమంది సీనియర్లకు విశ్రాంతి ఇచ్చినప్పటికీ, వన్డే సిరీస్‌లో మాత్రం భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. అఫ్గాన్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌లను రోహిత్-కోహ్లీ ద్వయం ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం. వన్డే ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ టీమ్ ఇండియాకు ఎంతో కీలకం కానుంది.
పూర్తి షెడ్యూల్ ఇలా..
- జూన్ 6న న్యూ చంఢీగఢ్‌లో ఏకైక టెస్ట్
- జూన్ 14న ధర్మశాలలో మ.1.30 గంటలకు తొలి వన్డే
- జూన్ 17న లక్నోలో మ.1.30 గంటలకు రెండో వన్డే
- జూన్ 20న చెన్నైలో మ.1.30 గంటలకు మూడో వన్డే
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: