📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Asia Cup 2025: ఆసియా కప్ చరిత్రలో తొలిసారి దాయాదుల మధ్య తుది సమరం

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025)చరిత్రలో ఫైనల్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తొలిసారి ఎదురుకాబోవడంతో ఈ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దుబాయ్ స్టేడియం ఇప్పటికే ఫుల్ అయ్యిందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం టికెట్ల కోసం అభిమానులు రోజుల తరబడి ప్రయత్నించారని, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ఆతృతగా, వేచి ఉన్నారు.

ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్, పాక్ జట్లు రెండుసార్లు తలపడగా.. ఆ మ్యాచ్ లకు ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రంగానే లభించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడవద్దని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

Asia Cup 2025: భారత్, పాక్ ఫైనల్..ఎక్కడ చూడాలంటే?

ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి

బాయ్ కాట్ పిలుపు నేపథ్యంలో గ్రూప్ దశలో జరిగిన తొలి మ్యాచ్ కు దుబాయ్ స్టేడియంలో చాలా వరకు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.స్టేడియానికి వెళ్లి చూసిన ప్రేక్షకుల సంఖ్య 20 వేల లోపే కావడం గమనార్హం.

దుబాయ్ స్టేడియంలో 28 వేల మంది ప్రేక్షకులకు సీటింగ్ సదుపాయం ఉంది. ఇక, సూపర్ 4 దశలో జరిగిన రెండో మ్యాచ్ కు ప్రత్యక్షంగా హాజరైన ప్రేక్షకుల సంఖ్య కేవలం 17 వేలు మాత్రమే. తొలి మ్యాచ్ తర్వాత జరిగిన షేక్ హ్యాండ్ వివాదం (Handshake controversy) ప్రభావం రెండో మ్యాచ్ పై పడింది.

ముచ్చటగా మూడోసారి భారత్-పాకిస్థాన్‌

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి భారత్-పాకిస్థాన్‌ తలపడనుండడం, అదికూడా ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్ లో ఇరు జట్లు పోటీపడడంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ స్టేడియం (Dubai Stadium) ఫుల్ అయిందని, మొత్తం 28 వేల టికెట్లు అమ్ముడయ్యాయని నిర్వాహకులు ప్రకటించారు.

Asia Cup 2025

ఫైనల్ లో గెలిచిన జట్టుకు ఆసియా కప్ అందించే విషయంపై తాజాగా వివాదం నెలకొంది. విజేతకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీ కప్ అందిస్తారని సమాచారం.

మ్యాచ్ ముగిసాక ప్రత్యర్థి జట్టు సభ్యులతో కరచాలనం

అయితే, నఖ్వీ చేతుల మీదుగా కప్ అందుకోవడానికి భారత జట్టు సుముఖంగా లేదని తెలుస్తోంది. టోర్నీలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ లు ఆడుతున్నట్లు చెబుతూ వచ్చిన భారత జట్టు.. మ్యాచ్ ముగిసాక ప్రత్యర్థి జట్టు సభ్యులతో కరచాలనం చేసే సంప్రదాయాన్ని పక్కన పెట్టింది.ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లలో భారత జట్టు గెలిచింది.

ఆ తర్వాత మైదానంలో పాక్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయలేదు. పాకిస్థాన్‌ కెప్టెన్ సల్మాన్ అఘా (Salman Agha) తో కలిసి ట్రోఫీ ఫొటోషూట్‌కే భారత్‌ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఫైనల్‌లో గెలిస్తే నఖ్వీ చేతులమీదుగా ట్రోఫీని తీసుకుంటుందా..

అనే సందేహం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే, ఈ అంశంపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. నఖ్వీతో వేదిక పంచుకోకూడదనే ఉద్దేశంలోనే భారత్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

asia cup final audience turnout cricket fan response cricket tournament Breaking News Dubai Stadium historic cricket final india pakistan rivalry India vs Pakistan latest news sold out match Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.