📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ICC Women’s ODI Rankings 2026: వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి నంబర్ వన్

Author Icon By Anusha
Updated: March 4, 2026 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ICC Women’s ODI Rankings 2026: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటారు. ఐసీసీ (ICC) మంగళవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో ఆమె ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచారు.. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన మంధాన, తన కెరీర్‌లో అత్యుత్తమంగా 790 రేటింగ్ పాయింట్లతో అగ్రపీఠాన్ని అధిరోహించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ లారా వోల్‌వార్ట్‌ను వెనక్కి నెట్టి మంధాన నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Read Also: IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

టాప్-10లో హర్మన్‌ప్రీత్.. జెమీమాకు మెరుగైన ర్యాంకు

మంధానతో పాటు ఇతర భారత బ్యాటర్లు కూడా ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాల్లో నిలిచారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్థిరమైన ప్రదర్శనతో 9వ స్థానంలో కొనసాగుతుండగా, యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 12వ స్థానానికి చేరుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో భారత టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉండటం రాబోయే ప్రపంచ కప్ సన్నాహకాల్లో జట్టుకు కొండంత బలాన్నిస్తోంది.

ICC Women’s ODI Rankings 2026: Smriti is number one in ODI rankings

ఆల్‌రౌండర్లలో దీప్తి శర్మ జోరు.. బౌలింగ్‌లోనూ టాప్

బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో భారత వెటరన్ ప్లేయర్ దీప్తి శర్మ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. బౌలర్ల జాబితాలో ఆమె 10వ స్థానంలో నిలవగా, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ పదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు.మొత్తంమీద ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత మహిళల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

: Smriti Mandhana No 1 ODI Batter Harmanpreet Kaur ODI Ranking ICC Women's ODI Rankings 2026 Smriti Mandhana vs Laura Wolvaardt

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.