📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

Suryakumar Yadav ranking : సూర్య టాప్-10లోకి ఎలా? నెంబర్-1గా అభిషేక్ షాక్!

Author Icon By Sai Kiran
Updated: January 28, 2026 • 7:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Suryakumar Yadav ranking : తాజా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ టాప్–10లోకి ప్రవేశించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న సూర్యకుమార్ ఐదు స్థానాలు ఎగబాకి 717 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల ఫామ్ కోసం ఇబ్బంది పడిన సూర్య, ఈ సిరీస్‌తో మళ్లీ తన క్లాస్‌ను చూపిస్తున్నాడు.

రెండో టీ20లో 82 పరుగులు, మూడో మ్యాచ్‌లో 57 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. మూడో టీ20లో 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి 68 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లోనూ 35 బంతుల్లో 84 పరుగులు చేసి మెప్పించాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 929 రేటింగ్ పాయింట్లతో అభిషేక్ నెంబర్–1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

Read Also: Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల

Suryakumar Yadav ranking

ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ 849 పాయింట్లతో (Suryakumar Yadav ranking) రెండో స్థానంలో, భారత యువ ఆటగాడు తిలక్ వర్మ 781 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. బౌలర్ల విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య మూడో స్థానానికి, శివమ్ దుబే 11వ స్థానానికి ఎగబాకగా, అక్షర్ పటేల్ మూడు స్థానాలు పడిపోయి 13వ ర్యాంక్‌లో నిలిచాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Abhishek Sharma number 1 Breaking News in Telugu Google News in Telugu Hardik Pandya all rounder ranking ICC T20 Rankings India T20 rankings Jasprit Bumrah ranking Latest News in Telugu Shivam Dube ranking Suryakumar Yadav ranking T20 batting rankings Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.