ఐసీసీ (ICC) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మరోసారి తమ సత్తా చాటారు. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో టీమిండియా ప్లేయర్లు మెరుగైన స్థానాలు సంపాదించారు. బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 7వ స్థానానికి, అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
Read Also: Sports: ఎక్కువ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేసే దిశగా BCCI అడుగులు
బౌలర్ల విషయానికొస్తే.. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్ ప్లేస్ లో, కొనసాగుతుండగా.. పేసు గుర్రం జస్ప్రిత్ బుమ్రా 4 స్థానాలు ఎగబాకి 13కు, రవి బిష్ణోయ్ 13 స్థానాలు ఎగబాకి 19కి, హార్దిక్ పాండ్యా 18 స్థానాలు ఎగబాకి 59వ స్థానానికి చేరారు. వరుణ్ చక్రవర్తి మినహా టాప్-10లో మరో భారత బౌలర్ లేడు. రషీద్ ఖాన్, హసరంగ 2,3 స్థానాలు నిలబెట్టుకున్నారు.
మిగతా భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 16, కుల్దీప్ యాదవ్ 25 స్థానాల్లో కొనసాగుతున్నారు. అల్ రౌండర్ ల విషయానికొస్తే.. టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఒకటి, 6 స్థానాలు మెరుగుపర్చుకొని 3, 12 స్థానాలకు ఎగబాకారు. టాప్-2గా సికందర్ రజా, సైమ్ అయూబ్ కొనసాగుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: