ICC T20 ranking list : International Cricket Council (ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ వికెట్‌కీపర్ బ్యాటర్ Ishan Kishan అదిరిపోయే లాంగ్ జంప్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించిన అతడు ఏకంగా 32 స్థానాలు ఎగబాకి 32వ ర్యాంక్‌లో నిలిచాడు. ఈ సిరీస్‌లో తొలి టీ20 సెంచరీతో పాటు మొత్తం 207 పరుగులు చేసి తన సత్తా చాటాడు.
ఇక భారత కెప్టెన్ Suryakumar Yadav ఒక స్థానం మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి చేరుకోగా, ఓపెనర్ Abhishek Sharma బ్యాటర్ల జాబితాలో నంబర్ వన్ స్థానంను కొనసాగించాడు.
ఆల్‌రౌండర్ల విభాగంలో పాకిస్థాన్ ఆటగాడు Saim Ayub టాప్ ర్యాంక్ సాధించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
Read Also:IPL2026: ఆరెంజ్ ఆర్మీకి కొత్త టెన్షన్
బౌలర్ల జాబితాలో పాకిస్థాన్ స్పిన్నర్ Abrar Ahmed రెండో స్థానానికి ఎగబాకాడు. భారత స్పిన్నర్ Varun Chakravarthy అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ర్యాంకింగ్స్ క్రికెట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ఇషాన్ కిషన్ ఫామ్ చూస్తుంటే రాబోయే మ్యాచ్‌ల్లో అతని నుంచి మరిన్ని భారీ ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: