📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: ICC Rankings: ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్

Author Icon By Anusha
Updated: November 26, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐసీసీ (ICC Rankings) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ రాడిల్‌ మిచెల్‌ను అధిగమించి నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గత రెండు మ్యాచుల్లో రేటింగ్‌ పాయింట్లు తగ్గడంతో రాడిల్‌ ర్యాంకు దిగజారింది. త్వరలోనే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ప్రారంభం కానున్న క్రమంలోనే రోహిత్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

Read Also: Gautam Gambhir: BCCI ఏ నా భ‌విష్య‌త్తును నిర్ణ‌యిస్తుంది: గంభీర్‌

రోహిత్ నంబర్ వన్ స్థానాకి చేరుకోవడంతో టీమిండియా అభిమానులు జట్టుకు శుభ సంకేతంగా భావిస్తున్నారు. ఇక ర్యాంకుల్లో (ICC Rankings) టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్ 4వ స్థానంలో, విరాట్‌ కోహ్లీ 5వ స్థానంలో, శ్రేయాస్‌ అయ్యర్‌ ఒక ర్యాంకు దిగజారి 9వ స్థానానికి చేరుకున్నాడు.మిచెల్ అగ్రస్థానాన్ని కోల్పోయినప్పటికీ న్యూజిలాండ్‌ ఇతర ప్లేయర్స్‌ రాణించారు.

రచిన్ రవీంద్ర ఒక స్థానం ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నారు. డెవాన్ కాన్వే 11 స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరాడు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తన అజేయ సెంచరీతో ర్యాంకింగ్స్‌లో ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్లలో మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీల అద్భుత ప్రదర్శన చేయడంతో ర్యాంకులు పెరిగాయి.

ఆల్ రౌండర్ ర్యాంకింగ్‌లో నంబర్ వన్ సికందర్ రజా

శాంట్నర్‌ 6వ స్థానం, హెన్ని 10వ స్థానంలో నిలిచాడు. జింబాబ్వే స్టార్ ఆటగాడు సికందర్ రజా తొలిసారిగా టీ20 అంతర్జాతీయ ఆల్ రౌండర్ ర్యాంకింగ్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకొని చరిత్ర సృష్టించాడు. ట్రై-సిరీస్‌లో అతని ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

ICC ODI batting rankings.. Rohit is the number one batsman

టెస్టుల్లో బౌలర్స్‌, ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లో ర్యాంకులు మారాయి.ఇంగ్లండ్‌కు చెందిన ఓలీ పోప్ ఇప్పుడు 24వ స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన తైజుల్ ఇస్లాం 15వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ బౌలర్లలో 5వ స్థానానికి ఎగబాకాడు.

బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్‌ శర్మ

ఆల్ రౌండర్ల జాబితాలో బెన్ స్టోక్స్ రెండవ స్థానానికి చేరగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో చెందిన రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల రోహిత్‌ శర్మ (Rohit Sharma) కు అరుదైన గౌరవం దక్కింది. రాబోయే టీ20 ప్రపంచ కప్-2026కి ఐసీసీ అతన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

ఈ టోర్నమెంట్ భారత్‌-శ్రీలంక వేదికగా జరుగనున్నది. రోహిత్ ఇప్పటివరకు తొమ్మిది టీ20 ప్రపంచ కప్‌లలో ఆడాడు. ఇందులో 2024లో టీమిండియా టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 47 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో 1,220 పరుగులు చేసిన రోహిత్ ఈ కొత్త పాత్ర పోషించనున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

icc odi rankings latest news Rohit sharma Shubman Gill Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.