📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: ICC – మహమ్మద్ సిరాజ్‌కి ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా ప్రధాన వేగవంత బౌలర్, హైదరాబాద్‌ డీఎస్పీగా పనిచేస్తున్న మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీ సిరీస్‌ (Anderson-Sachin Trophy series) లో అతను చూపిన అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గుర్తింపు లభించింది. ఆగస్టు నెలకు గాను “ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డును సిరాజ్ దక్కించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణం అయింది.

ఈ సిరీస్‌లో భారత జట్టు మొదటి నుంచీ కష్టతర పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, సిరాజ్ తన దూకుడు బౌలింగ్‌తో మ్యాచ్‌లను సజీవంగా ఉంచాడు. మొత్తం ఐదు టెస్ట్‌లను ఆడిన అతను 23 వికెట్లు తీయడం ద్వారా భారత బౌలర్లలో అగ్రస్థానంలో నిలిచాడు. పేస్, లైన్-లెంగ్త్‌ నియంత్రణ, సవాలును ఎదుర్కొనే ధైర్యం సిరాజ్‌ బౌలింగ్‌లో స్పష్టంగా కనిపించాయి.

ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రావడం

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు (Player of the Month Award) రావడం సిరాజ్‌కు ఇదే తొలిసారి. ఓవరాల్‌గా ఈ ఘనతను అందుకున్న 9వ బ్యాటర్‌గా సిరాజ్‌ నిలిచాడు. అతని కన్నా ముందు రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, జస్‌ప్రీత్ బుమ్రా ఈ అవార్డ్ అందుకున్నారు. ఇందులో శుభ్‌మన్ గిల్ ఒక్కడే నాలుగు సార్లు ఈ అవార్డు అందుకోగా.. బుమ్రా, అయ్యర్ రెండేసి సార్లు స్వీకరించారు.

ICC

అంతర్జాతీయ క్రికెట్‌లో 30 రోజుల్లో మూడు ఫార్మాట్ల (Three formats) లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఈ అవార్డ్‌కు నామినేట్ చేస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ప్రతి నెల ఐసీసీ ఈ అవార్డ్ ప్రకటిస్తుంది. భారత్ మినహా మరే జట్టు కూడా ఇన్ని అవార్డ్స్ గెలుచుకోలేదు. ఈ ఏడాది ఈ అవార్డ్ అందుకున్న నాలుగో భారత ఆటగాడు సిరాజ్. ఫిబ్రవరి, జూలైలో గిల్, మార్చిలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఈ అవార్డు స్వీకరించారు.

అవార్డు అందుకోవడం ప్రత్యేక గౌరవం

ఈ అవార్డు అందుకోవడంపై సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకోవడం ప్రత్యేక గౌరవం. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) మరిచిపోలేని సిరీస్. నేను ఆడిన అత్యంత ఉత్కంఠమైన సిరీస్‌ల్లో ఇది ఒకటి. ముఖ్యంగా ఈ సిరీస్‌లో భారత విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది.

ప్రత్యర్థి గడ్డపై వారి టాప్ క్లాస్ బ్యాటింగ్ లైనప్‌కు బౌలింగ్ చేయడం సవాల్ అయినప్పటికీ… నా అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాను.ఈ అవార్డ్ క్రెడిట్ నా సహచర ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్‌ది. వారి ప్రొత్సాహం, నాపై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపించాయి. నేను భారత జెర్సీ ధరించిన ప్రతీసారి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను.’అని సిరాజ్ పేర్కొన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/terrorism-must-stop-sports-must-continue-ganguly/breaking-news/547971/

23 wickets performance Anderson Sachin Trophy England Test Series hyderabad dsp icc award Mohammad Siraj team india star pacer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.