ICC CEO : ఆసియా కప్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మరియు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC CEO) మధ్య జరిగిన వేడిగాన్న స్టాండ్ ఆఫ్ లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి – ఐసీసీ కొత్త CEO సంజోగ్ గుప్తా. పాకిస్థాన్ తరఫున మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని చేసిన డిమాండ్‌ను ఆయన సింగిల్ హ్యాండెడ్‌గా అడ్డుకున్నారు.
ఏం జరిగింది?
సెప్టెంబర్ 14న దుబాయ్ లో జరిగిన ఇండియా–పాకిస్థాన్ గ్రూప్ A మ్యాచ్ తరువాత, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో చేతులు కలపడానికి నిరాకరించారు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు గౌరవంగా, భారత ఆర్మీకి సపోర్ట్‌గా తాను ఆ నిర్ణయం తీసుకున్నానని సూర్య చెప్పాడు.
ఈ ఘటనలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిష్పాక్షికంగా వ్యవహరించలేదని ఆరోపిస్తూ, PCB ఆయనను తప్పించమని, రిచీ రిచర్డ్సన్‌ను రిఫరీగా నియమించాలని ఐసీసీకి డిమాండ్ చేసింది. అయితే, ఐసీసీ CEO సంజోగ్ గుప్తా నేతృత్వంలో జరిగిన చర్చల్లో ఈ డిమాండ్ పూర్తిగా తిరస్కరించబడింది.
ఐసీసీ స్పందన
సంజోగ్ గుప్తా స్పష్టంగా తెలిపారు: పైక్రాఫ్ట్ తప్పు చేయలేదని, ఎటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరగలేదని. ఆరు ఇమెయిల్స్ లో సాగిన చర్చల తరువాత ఐసీసీ, “సాక్ష్యం లేకుండా రిఫరీని మార్చడం తప్పు ఉదాహరణ అవుతుంది” అని ప్రకటించింది. పాకిస్థాన్ ను శాంతింపజేయడానికి ఒక మ్యాచ్‌కైనా పైక్రాఫ్ట్ స్థానంలో వేరే రిఫరీని పెట్టాలని ప్రతిపాదించినా, గుప్తా దానిని ఖచ్చితంగా తిరస్కరించారు.
సంజోగ్ గుప్తా ఎవరు?
- సంజోగ్ గుప్తా ఐసీసీ చరిత్రలో మొదటి భారతీయ CEO.
- 2010లో స్టార్ ఇండియాలో చేరి, 2020లో డిస్నీ స్టార్ లో హెడ్ ఆఫ్ స్పోర్ట్స్‌గా ఎదిగారు.
- IPL, ICC ఈవెంట్స్, ISL, ప్రో కబడ్డీ వంటి టోర్నీలను భారతీయులకు దగ్గర చేశారు.
- 2024లో Viacom18–Disney Star విలీనం తరువాత JioStar లో CEO గా ఉన్నారు.
- డిజిటల్ ఇన్నోవేషన్, గ్లోబల్ ఎక్స్పాన్షన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి, 2025లో ఐసీసీ CEO గా ఎంపికయ్యారు.
గట్టి ప్రారంభం
పైక్రాఫ్ట్ ఘటనను ఆయన హ్యాండిల్ చేసిన తీరు క్రికెట్ ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఎవరు ఫిర్యాదు చేసినా, రాజకీయ ఒత్తిళ్లను పక్కన పెట్టి, ఐసీసీ క్రమశిక్షణ, న్యాయబద్ధతను కాపాడుతుందని ఆయన నిర్ణయం చూపించింది.
Read also :