हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Haris Rauf: పాకిస్థాన్ ప్లేయర్ హరీస్ రవూఫ్ పై ఐసీసీ నిషేధం

Aanusha
Latest News: Haris Rauf: పాకిస్థాన్ ప్లేయర్ హరీస్ రవూఫ్ పై ఐసీసీ నిషేధం

పాకిస్థాన్ క్రికెట్‌లో మరోసారి వివాదం తలెత్తింది. జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్‌ (Haris Rauf) పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠిన నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రవూఫ్ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ, అతడిపై రెండు వన్డే మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఈ నిర్ణయం పాకిస్థాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బగా మారింది.

Read Also: ICC: ఆసియా కప్‌లో ఆటగాళ్లపై ICC కఠిన చర్యలు

ఈ నిషేధంతో దక్షిణాఫ్రికాతో నవంబర్ 4, 6 తేదీల్లో జరగనున్న రెండు వన్డే మ్యాచ్‌లకు రవూఫ్ దూరమయ్యాడు.సెప్టెంబర్ 28న భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఐసీసీ (ICC) మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ నిర్వహించిన విచారణలో రవూఫ్ (Haris Rauf) దోషిగా తేలాడు. ఆర్టికల్ 2.21ను ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు, రెండు డీమెరిట్ పాయింట్లను కేటాయించారు.

అంతకుముందు సెప్టెంబర్ 14న జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లోనూ రవూఫ్ ఇదే తప్పిదానికి పాల్పడి రెండు డీమెరిట్ పాయింట్లు పొందాడు. దీంతో 24 నెలల వ్యవధిలో అతని ఖాతాలో మొత్తం నాలుగు డీమెరిట్ పాయింట్లు చేరాయి.

 Haris Rauf
 Haris Rauf

రవూఫ్‌పైనే కాకుండా పలువురు ఆటగాళ్లపై

ఐసీసీ నిబంధనల ప్రకారం ఇది రెండు సస్పెన్షన్ పాయింట్లకు సమానం కావడంతో అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల సందర్భంగా కేవలం రవూఫ్‌పైనే కాకుండా పలువురు ఆటగాళ్లపై కూడా ఐసీసీ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది.

పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్.. భారత్‌తో సూపర్‌ 4 మ్యాచ్‌లో అర్ధశతకం తర్వాత ‘గన్ సెలబ్రేషన్’ చేసుకున్నందుకు అతనికి అధికారిక హెచ్చరికతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించారు.మరోవైపు, భారత ఆటగాళ్లకు కూడా జరిమానాలు తప్పలేదు.

ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు

సెప్టెంబర్ 14 నాటి మ్యాచ్‌లో ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav) కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా, రెండు డీమెరిట్ పాయింట్లు విధించారు.

ఫైనల్‌లో జస్‌ప్రీత్ బుమ్రా లెవల్ 1 తప్పిదాన్ని అంగీకరించడంతో అతనికి అధికారిక హెచ్చరిక, ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టారు. కాగా, అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడన్న ఆరోపణల నుంచి భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు క్లీన్ చిట్ లభించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870