📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Sunil Gavaskar: ఐపీఎల్‌లో ఆ జట్టు తరుపున ఆడాలనుకుంటున్నా: గవాస్కర్

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మరోసారి తన వినోదాత్మక వ్యాఖ్యలతో క్రికెట్ అభిమానులను అలరించాడు. ఆసియా కప్ 2025 టోర్నీ సందర్భంగా ప్రస్తుతం బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేస్తున్న ఆయన, తన ఆటగాళ్ల రోజుల్ని గుర్తుచేసుకుంటూ ముంబై ఇండియన్స్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున తాను ఆడాలని ఉందని, దానికి హార్దిక్ పాండ్యా మద్దతు ఇవ్వాలంటూ సరదాగా కోరినట్లు గవాస్కర్ వెల్లడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Asia Cup 2025: మేం ఏ జట్టునైనా ఓడించగలం: పాక్ కెప్టెన్

ప్రస్తుతం ఆసియా కప్‌ (Asia Cup 2025) లో టీమిండియా దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచ్‌లలో గెలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ముఖ్యంగా సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. జట్టు ధైర్యాన్ని రెట్టింపు చేసింది. ఈ సందర్భంలోనే బ్రాడ్‌కాస్టర్ కేబిన్లో సునీల్ గవాస్కర్ – హార్దిక్ పాండ్యా మధ్య చర్చ జరగడం విశేషంగా మారింది.

ఈ సంభాషణ గురించి అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony Sports Network) హోస్ట్ ప్రశ్నించాడు.హార్దిక్ పాండ్యాతో ఏం మాట్లాడారని వివరణ కోరాడు. ఇందుకు సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో సమాధానమిచ్చి నవ్వులు పూయించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెప్ అయిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ను ఐపీఎల్‌లో తనను పరిగణలోకి తీసుకోవాలని కోరానని చెప్పాడు. దాంతో హోస్ట్ పగలబడి నవ్వాడు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

Sunil Gavaskar

ముంబై ఇండియన్స్‌తోనే తన ఐపీఎల్ కెరీర్‌ ప్రారంభించిన హార్దిక్

ఎటకారంలో గవాస్కర్‌‌ను మించినోడు లేడని కామెంట్ చేస్తున్నారు.తన కెరీర్‌లో 125 టెస్ట్‌లు ఆడిన గవాస్కర్ 10122 పరుగులు చేశాడు. ఇందులో 34 శతకాలు ఉన్నాయి. 108 వన్డేల్లో 3092 పరుగులతో రాణించాడు. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సునీల్ గవాస్కర్ ఒక సభ్యుడు. అతని సారథ్యంలో టీమిండియా వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ (Team India World Championship title)గెలిచింది.మరోవైపు ముంబై ఇండియన్స్‌తోనే తన ఐపీఎల్ కెరీర్‌ ప్రారంభించిన హార్దిక్ పాండ్యా 2021 వరకు ఆ జట్టుకే ఆడాడు.

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు అతను గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans)కు వెళ్లి ఆ జట్టు సారథ్యం బాధ్యతలు చేపట్టాడు. అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా.. ఆ మరుసటి ఏడాది రన్నరప్ టైటిల్ అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు క్యాష్ డీల్ ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ (Mumbai Indians)జట్టులోకి వచ్చి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే ఐపీఎల్ 2020 నుంచి ముంబై ఇండియన్స్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Asia Cup 2025 Breaking News commentator role Hardik Pandya ipl wish latest news Mumbai Indians Sunil Gavaskar Super 4 Match Team India winning streak Telugu News Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.