ఫుట్‌బాల్ ప్రపంచంలో “లెజెండ్” అనే పదానికి అర్థం చెప్పాలంటే క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) పేరే సరిపోతుంది. అద్భుత ప్రతిభ, అచంచల కృషి, అజేయ మనోబలం కలిగిన ఈ పోర్చుగీస్ స్టార్ ఇప్పుడు తన కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రొనాల్డో (Cristiano Ronaldo) మాట్లాడుతూ, త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు.
Read Also: Haris Rauf: పాకిస్థాన్ ప్లేయర్ హరీస్ రవూఫ్ పై ఐసీసీ నిషేధం
‘ఇది నిజంగానే కష్టంగా ఉంటుంది. నేను కచ్చితంగా ఏడ్చేస్తాను. 25 ఏళ్ల వయసు నుంచే నేను నా ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేసుకున్నాను. నాకు వేరే ప్యాషన్స్ ఉన్నాయి. కాబట్టి పెద్దగా బోర్ కొట్టకపోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత నా కోసం, నా పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను’ అని తెలిపారు.
2003లో మాంచెస్టర్ యునైటెడ్ తరపున అరంగేట్రం చేసిన రొనాల్డో, తర్వాత రియల్ మాడ్రిడ్, జువెంటస్, అల్ నస్ర్ వంటి క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ప్రయాణంలో అయిదు బాలన్ డి’ఓర్ అవార్డులు, అనేక లీగ్ టైటిల్స్, ఛాంపియన్స్ లీగ్ విజయాలు సాధించాడు. అంతేకాదు, పోర్చుగల్ తరపున యూరో 2016, నేషన్స్ లీగ్ 2019 ట్రోఫీలను గెలిపించి దేశ చరిత్రలో నిలిచిపోయాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: