ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో టీమిండియా ప్రదర్శన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంది. బంగ్లాదేశ్‌తో సూపర్-4 మ్యాచ్‌లో భారత జట్టు అసాధారణంగా ప్రదర్శించిందని చెప్పవచ్చు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టును ఓడించింది. ఈ విజయంతో ఈ సీజన్‌లో ఓటమి రుచి చూడని భారత జట్టు నేరుగా ఫైనల్‌కి దూసుకెళ్లింది.
ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన వినూత్న బ్యాటింగ్‌తో దృష్టిని ఆకర్షించాడు. 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 రన్స్ సాధించి జట్టుకు ప్రధాన తోడ్పాటును ఇచ్చాడు. ఈ విధ్వంసకర హాఫ్ సెంచరీకే కాకుండా, అభిషేక్ శర్మ తన ఆటలో చూపిన స్థిరత్వం, ధైర్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులని చేసింది. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఆయనకు మంజూరైంది.
West Indies series: వెస్టిండీస్ సిరీస్ కు భారత జట్టు ఇదే!
అభిషేక్ శర్మ తన ఆట విధానం గురించి మాట్లాడుతూ,తన బ్యాటింగ్ శైలి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. దూకుడుగా ఆడేందుకు తాను చాలా కష్టపడ్డానని, నెట్స్‌లో గంటలకొద్దీ ప్రాక్టీస్ చేశానని చెప్పాడు.’నేను నా జట్టుకు కాల్సిన పనిని పూర్తి చేశాను. నేను గతంలోనే చెప్పాను. ఓ ఫ్లో ప్రకారం ఆడుతాను. నా రేంజ్‌లో ఉంటే అది మొదటి బంతి అయినా సరే భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నిస్తాను. తద్వారా పవర్ ప్లే (Power play)లో జట్టుకు మంచి స్కోర్ అందించాలనుకుంటాను.
గత మ్యాచ్‌ల్లో నా వికెట్ తీయాలని ప్రత్యర్థి బౌలర్లు ప్రయత్నించారు.అందుకే నేను తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాను. కానీ ఈ మ్యాచ్‌లోని పిచ్ కొత్తది. ఈ పిచ్ కండిషన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. అందుకే నేను, శుభ్‌మన్ గిల్ (Shubhman Gill)కాస్త సమయం తీసుకొని ఆడాలని నిర్ణయించుకున్నాం. నేను ఎప్పుడూ ఫీల్డ్‌ను బట్టి ఆడాలనుకుంటాను. ఫీల్డ్‌ను చూసే షాట్స్ ఆడుతాను. ఇలా దూకుడుగా ఆడేందుకు నేను నెట్స్ (Nets)లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాను. బ్యాటర్లకు నెట్స్‌లో చాలా బంతులు ఆడే సమయం దొరుకుతుంది.
నేను మాత్రం ఔటవ్వకుండా ప్రాక్టీస్ చేస్తాను
నెట్స్‌లో చాలా షాట్స్ ఆడితే ఔటయ్యే అవకాశం ఉంటుంది. కానీ నేను మాత్రం ఔటవ్వకుండా ప్రాక్టీస్ చేస్తాను.’అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), శుభ్‌మన్ గిల్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్ (Rishad Hossain) (2/27) రెండు వికెట్లు తీయగా.. తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహమ్మద్ సైఫిద్దిన్ తలో వికెట్ తీసారు.అనంతరం బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.
ఓపెనర్ సైఫ్ హసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీ (Half a century)తో పోరాడినా ఫలితం లేకపోయింది. పర్వేజ్ హోస్సేన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/18), వరుణ్ చక్రవర్తీ(2/29) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మ చెరో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫీల్డర్లు ఐదు క్యాచ్‌లు నేలపాలు చేశారు. ఇందులో నాలుగు క్యాచ్‌లు సైఫ్ హసన్‌వే కావడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: