📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Sourav Ganguly: కెరీర్‌లో సెంచ‌రీలను చేసే అవ‌కాశాల‌ను మిస్స‌య్యాను: సౌర‌వ్ గంగూలీ

Author Icon By Sudha
Updated: June 23, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సౌర‌వ్ గంగూలీ తన కెరీర్‌లో ఎన్నోసార్లు హాఫ్ సెంచరీలు (80లు, 70లు) చేశాక సెంచరీకి మార్చలేకపోయిన అనుభవాన్ని పంచుకున్నారు. కొన్ని సందర్భాల్లో 80-90ల్లో విఫలమయ్యిన ఇన్నింగ్స్‌లను సరైన సెంచ‌రీలుగా మ‌లిస్తే ఆయన 50 సెంచరీల మైలురాయిని దాటేవాడిన‌న్నాడు.

Sourav Ganguly: కెరీర్‌లో సెంచ‌రీలను చేసే అవ‌కాశాల‌ను మిస్స‌య్యాను: సౌర‌వ్ గంగూలీ

మిస్ అయిన‌
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. పీటీఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న మ‌నోగ‌తాన్ని వివ‌రించారు. త‌న కెరీర్‌లో ఎన్నో సెంచ‌రీలను చేసే అవ‌కాశాల‌ను మిస్ అయిన‌ట్లు పేర్కొన్నారు. వాస్త‌వానికి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో గంగూలీ 38 సెంచ‌రీలు చేశారు. కానీ మ‌రికొన్ని సెంచ‌రీలు చేసే అవ‌కాశాన్ని కోల్పోయిన‌ట్లు తెలిపారు. ఎడ‌మ చేతి బ్యాట‌ర్ గంగూలీ.. టెస్టులు, వ‌న్డేల్లో క‌లిపి మొత్తం 18575 ర‌న్స్ చేశారు. అత‌ను 311 వ‌న్డేలు, 113 టెస్టులు ఆడారు. అయితే వీటిల్లో ప‌లు సంద‌ర్భాల్లో సెంచ‌రీలు చేసే అవ‌కాశాన్ని చేజార్చుకున్న‌ట్లు చెప్పారు.
మైలురాయిని దాటేవాడిని
ఎన్నో సెంచ‌రీలు మిస్స‌య్యాన‌ని, వాస్త‌వానికి మ‌రిన్ని సెంచ‌రీలు చేయాల్సి ఉంద‌ని, ఎన్నోసార్లు 90, 80 ర‌న్స్ స్కోర్ చేసిన‌ట్లు తెలిపారు. క్రికెట్ గ‌ణాంకాల ప్ర‌కారం సుమారు 30 సార్లు సెంచ‌రీకి చేరువ‌లో గంగూలీ ఔటైన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ గంగూలీ ఆ ఇన్నింగ్స్‌ల‌ను సెంచ‌రీలుగా మ‌లిస్తే, అప్పుడు అత‌ను 50 సెంచ‌రీల మైలురాయిని దాటేవాడినని ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో.. బ్యాటింగ్ వీడియోల‌ను చూస్తుంటాన‌ని, త‌న భార్య సారా లండ‌న్‌లో ఉంటుంద‌ని, ఆమెకు దూరంగా ఉన్న స‌మ‌యంలో ఆ వీడియోలు చూస్తాన‌ని, యూట్యూబ్‌కు వెళ్లి వీడియోలు చూస్తాన‌ని, 70ల్లో ఔట్ అవ్వ‌గానే .. సెంచ‌రీ చేయాల్సి ఉండే అన్న భావ‌న వ‌స్తుంద‌న్నాడు. కానీ గ‌తాన్ని మార్చ‌లేమ‌న్నారు.
పెద్ద స‌మ‌స్య
వ‌న్డేల్లో గంగూలీ మొత్తం 72 హాఫ్ సెంచ‌రీలు చేశారు. ఇక టెస్టుల్లో 35 అర్థ‌శ‌త‌కాలు సాధించారు. కెప్టెన్‌గా కొన్ని సంద‌ర్భాల్లో కీల‌క‌మైన ఆట‌గాళ్ల‌ను డ్రాప్ చేయ‌డం పెద్ద స‌మ‌స్య అన్నారు. ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లు ఆ నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌చ్చేద‌ని, అనిల్ కుంబ్లే గొప్ప బౌల‌ర్ కానీ, ప‌రిస్థితుల వ‌ల్ల అత‌న్ని ప‌లుమార్లు త‌ప్పించాల్సి వ‌చ్చింద‌న్నారు. త‌న‌కు ఆస్ట్రేలియా ఫెవ‌రేట్ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు అని, గ్లెన్ మెక్‌గ్రాత్ చాలా ప్ర‌మాద‌క‌ర బౌల‌ర్ అన్నారు.2007‑2008 మధ్య: “లోవర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం వల్ల నేను అనేక సెంచరీలను కోల్పోయానని” గంగూలీ స్పష్టం చేశారు.

Read Also:Karun Nair: కరుణ్ నాయర్ అరుదైన ఘనత

#50Hundreds #BattingForm #ConversionRate #CricketAnalysis #MissedCenturies #SouravGanguly Breaking News in Telugu Google news Google News in Telugu I missed opportunities to Latest News in Telugu Paper Telugu News score centuries in my career Sourav Ganguly Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.