Latest News: Mohammed Shami: నేనిప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నా: షమీ

Read Time:  1 min
Mohammed Shami
Mohammed Shami
FONT SIZE
GET APP

2023 వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమిండియాకు దూరమైన సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. గత ఏడాది వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన షమీ, గాయం కారణంగా క్రికెట్‌కు కొంతకాలం దూరమయ్యాడు. ఇక ఇప్పుడు పూర్తి ఫిట్‌గా తిరిగి వచ్చి తన కెరీర్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు.

Read Also: ODI: వన్డేలో అత్యధిక మెయిడెన్ ఓవర్లు

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పర్యటనకు తన ఎంపిక చేయకపోవడంపై అతను చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని, అయితే జట్టులోకి తీసుకోవడం తన చేతుల్లో లేదని షమీ స్పష్టం చేశాడు.


Mohammed Shami
Mohammed Shami

తనను ఎంపిక చేయకపోవడంపై

బుధవారం నుంచి ఉత్తరాఖండ్‌తో ఈడెన్ గార్డెన్స్‌ (Eden Gardens) లో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగుతున్నాడు. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన అతను, “నాలో ఫిట్‌నెస్ సమస్యలు ఉంటే ఇక్కడ ఉండేవాడిని కాదు.

నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగినప్పుడు, 50 ఓవర్ల మ్యాచ్ కూడా ఆడగలను” అని ధీమా వ్యక్తం చేశాడు.టీమిండియాకు తనను ఎంపిక చేయకపోవడంపై షమీ (Mohammed Shami) స్పందించాడు. “జట్టులో చోటు దక్కకపోవడం నా తప్పు కాదు.

యాజమాన్యానికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత

నా పని సిద్ధమవడం, మ్యాచ్‌లు ఆడటం మాత్రమే. అవకాశాలు వచ్చినప్పుడల్లా నేను బెంగాల్ తరఫున ఆడాను. నన్ను ఎంపిక చేస్తే ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. ఇందులో ఎలాంటి సమస్య లేదు” అని అన్నాడు.అంతేకాకుండా, తన ఫిట్‌నెస్ (Fitness) గురించి సెలక్టర్లకు లేదా జట్టు యాజమాన్యానికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత తనపై లేదని షమీ తేల్చిచెప్పాడు.

“నా ఫిట్‌నెస్‌పై ఎవరికీ అప్‌డేట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అది నా బాధ్యత కాదు. నా పని నేను చేస్తాను. అప్‌డేట్స్ ఎప్పుడు ఇవ్వాలనేది యాజమాన్యం లేదా సెలక్టర్లు నిర్ణయిస్తారు” అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.