Shikhar Dhawan Divorce Case: శిఖర్ ధావన్‌కు భారీ ఊరట

Read Time:  1 min
Shikhar Dhawan Divorce Case: శిఖర్ ధావన్‌కు భారీ ఊరట
FONT SIZE
GET APP

Shikhar Dhawan Divorce Case: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు తన మాజీ భార్య ఐషా ముఖర్జీతో జరుగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటంలో ఊరట లభించింది. ఐషాకు గతంలో చెల్లించిన సుమారు రూ. 5.72 కోట్లను తిరిగి ధావన్‌కు అప్పగించాలని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2023లో పరస్పర అంగీకారంతో విడాకులు పొందిన నాటి నుండి ఈ జంట మధ్య ఆస్తుల పంపిణీపై వివాదం నడుస్తోంది. తాజా తీర్పుతో ధావన్‌కు పెద్ద ఊరట లభించినట్లయింది.

Read Also: ENG vs PAK: ఉత్కంఠ పోరులో పాక్ పై ఇంగ్లాండ్ విజయం

వివాదానికి కారణమైన ఆస్ట్రేలియా కోర్టు నిబంధనలు

ఈ వివాదం వెనుక ఆస్ట్రేలియా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. ఆస్ట్రేలియా పౌరసత్వం ఉన్న ఐషా ముఖర్జీ, అక్కడి కోర్టులో “ప్రాపర్టీ సెటిల్‌మెంట్” కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆ దేశ చట్టాల ప్రకారం విడాకుల తర్వాత భార్యాభర్తల మధ్య ఆస్తుల పంపిణీ జరగాలి. ఈ నిబంధన కింద ధావన్ తన మాజీ భార్యకు రూ. 5.72 కోట్లు బదిలీ చేయాల్సి వచ్చింది.

Huge relief for Shikhar Dhawan
Huge relief for Shikhar Dhawan

అయితే, ఆస్ట్రేలియా కోర్టు ఆదేశాలను ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు సవాలు చేసింది. ఆస్ట్రేలియాలో ఉన్న “ప్రాపర్టీ సెటిల్‌మెంట్” అనే భావన భారత న్యాయ వ్యవస్థకు, ముఖ్యంగా హిందూ వివాహ చట్టానికి పూర్తిగా విరుద్ధమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. భారత చట్టాల్లో ఇలాంటి ఆస్తి పంపిణీకి ఎలాంటి నిబంధనలు లేవని స్పష్టం చేశారు. ఈ కారణంగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పు ఇక్కడ చెల్లదని పేర్కొంటూ, ఐషా ముఖర్జీ ఆ డబ్బును తిరిగి ధావన్‌కు చెల్లించాలని ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.