భారత క్రికెట్ నియంత్రణ మండలి, BCCI తన రిటైర్డ్ ప్లేయర్స్ పెన్షన్ స్కీమ్ ద్వారా దేశానికి సేవ చేసిన మాజీ క్రికెటర్లకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ పథకం క్రికెట్‌కు తమ జీవితాన్ని అంకితం చేసిన ఆటగాళ్లకు గౌరవ సూచకంగా అమలు అవుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) కి నెలకు రూ.70,000 పెన్షన్ అందుతున్నట్లు సమాచారం. ఇది బీసీసీఐ పెన్షన్ స్కీమ్‌లో అత్యున్నత కేటగిరీ కావడం విశేషం.
Read also: T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ కు పాక్ జట్టు ప్రకటన
దేశం కోసం చేసిన సేవలకు గౌరవంగా
90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ (MS Dhoni) , 25 కంటే ఎక్కువ టెస్టులు ఆడిన క్రికెటర్ల అత్యున్నత పెన్షన్ కేటగిరీ కిందకు వస్తారు. 2022లో బీసీసీఐ గరిష్ట పెన్షన్‌ను రూ. 50,000 నుండి రూ. 70,000కు పెంచింది. ఆర్థికంగా స్థిరంగా ఉన్నా, ఈ పెన్షన్‌ను దేశం కోసం చేసిన సేవలకు గౌరవంగా భావిస్తారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: