📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Hong Kong Sixes 2025: భారత్‌ వరుసగా రెండో ఓటమి

Author Icon By Anusha
Updated: November 8, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హాంగ్‌కాంగ్ సిక్సెస్ 2025 (Hong Kong Sixes 2025) టోర్నమెంట్‌లో భారత జట్టు అనూహ్యంగా బలహీన ప్రదర్శన కనబరుస్తోంది. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఫలితంతో టీమిండియా (Team India) కు టోర్నీలో వరుసగా రెండో పరాజయం నమోదైంది.భారత్ నిర్దేశించిన 108 పరుగుల లక్ష్య ఛేదనలో యూఏఈకి అద్భుతమైన ఆరంభం లభించింది.

Read Also: WWC 2025: డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన ఉమెన్స్ వరల్డ్ కప్

ఓపెనర్లు ఖలీద్ షా, సఘీర్ ఖాన్ తొలి రెండు ఓవర్లలోనే 42 పరుగులు జోడించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నప్పటికీ, చివర్లో మహమ్మద్ అర్ఫాన్ చెలరేగాడు.

మ్యాచ్ ముగియడానికి ఒక బంతి మిగిలి ఉండగా భారీ సిక్సర్ కొట్టి యూఏఈ (UAE) కి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ, భరత్ చిప్లీ తలో రెండు వికెట్లు తీశారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.

27 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్

అభిమన్యు మిథున్ 50 పరుగుల‌తో అద్భుతంగా రాణించగా, దినేశ్ కార్తీక్ 42 ర‌న్స్‌తో అతనికి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి మెరుపులతో భారత్ పోరాడగలిగే స్కోరు సాధించినా, బౌలర్లు దానిని కాపాడటంలో విఫలమయ్యారు.ఈ టోర్నీలో కువైట్ చేతిలో 27 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్, ఇప్పుడు యూఏఈ చేతిలోనూ ఓడిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Breaking News Hong Kong Sixes 2025 india vs uae latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.