हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

Latest News: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

Aanusha
Latest News: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజా ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడిన అయ్యర్‌పై శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడని, ఆరోగ్యం స్థిరంగా ఉందని సంస్థ స్పష్టం చేసింది.

Read Also: IND vs AUS:  నేడే భారత్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ ప్రారంభం

వివరాల్లోకి వెళ్తే, ఈ నెల  25న సిడ్నీలో జరిగిన వన్డేలో ఓ క్యాచ్ అందుకునే క్రమంలో అయ్యర్ (Shreyas Iyer) పొత్తికడుపునకు బలమైన గాయమైంది. దీంతో అతడిని వెంటనే మైదానం నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీసీసీఐ (BCCI) విడుదల చేసిన ప్రకటనలో “గాయాన్ని వెంటనే గుర్తించి, రక్తస్రావాన్ని అరికట్టాం.

28న తీసిన స్కానింగ్‌లో అతడి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడినట్లు తేలింది. శ్రేయస్ కోలుకుంటున్నాడు. సిడ్నీ, భారత నిపుణులతో కూడిన బీసీసీఐ వైద్య బృందం అతడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది” అని వివరించింది.ఈ గాయం కారణంగా, నేటి నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అయ్యర్ దూరమయ్యాడు.

Shreyas Iyer
Shreyas Iyer

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌ నాటికి పూర్తి ఫిట్‌నెస్

ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు అయ్యర్‌ను జట్టు వైస్-కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న అయ్యర్, త్వరలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో పర్యటించనున్న దక్షిణాఫ్రికా జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 30 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870