📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Hasan Nawaz : పాక్ జట్టులో కొత్త స్టార్ వచ్చాడు

Author Icon By Divya Vani M
Updated: March 21, 2025 • 6:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hasan Nawaz : పాక్ జట్టులో కొత్త స్టార్ వచ్చాడు ఇటీవల కాలంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది.స్టార్ ఆటగాళ్లు ఫామ్ లో లేకపోవడంతో పాక్ విజయాలు దూరమవుతున్నాయి.తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో పాక్ వరుసగా రెండు టీ20 మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది.మూడో మ్యాచ్ లోనూ ఓటమి ఖాయం అని భావించినా యువ ఆటగాడు హసన్ నవాజ్ మాత్రం అద్భుత ప్రదర్శనతో జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. న్యూజిలాండ్ ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానం హసన్ నవాజ్ వీరబాదుడుకు వేదికైంది.ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 19.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయ్యింది.కివీస్ జట్టులో చాప్‌మెన్ 44 బంతుల్లో 94 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు.అతని ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.

Hasan Nawaz పాక్ జట్టులో కొత్త స్టార్ వచ్చాడు

204 పరుగుల లక్ష్యం పాక్‌ కోసం పెద్దసవాల్ గా మారింది. ఇంతవరకు న్యూజిలాండ్ పై వరుస ఓటములే ఎదురవుతుండటంతో ఈ మ్యాచ్ లోనూ పాక్ మరో ఓటమి ఖాయమేనని అందరూ భావించారు.అయితే 22 ఏళ్ల హసన్ నవాజ్ ఒక్కరే మ్యాచ్ దిశను మార్చేశాడు.పాక్ ఓపెనర్ హసన్ నవాజ్ కివీస్ బౌలర్లను చిత్తు చేస్తూ చిచ్చరపిడుగులా ఆడాడు. మొత్తం 45 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సులతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని విధ్వంసక బ్యాటింగ్ కు న్యూజిలాండ్ బౌలర్లు ఏం చేయాలో తెలియకుండా అవాక్కయ్యారు. హసన్ నవాజ్ ఇన్నింగ్స్ తో పాకిస్థాన్ జట్టు 205 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే చేధించింది. పాక్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించడం విశేషం.

కెప్టెన్ సల్మాన్ ఆఘా, హరీస్ కీలక భాగస్వామ్యం

హరీస్ 20 బంతుల్లో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
సల్మాన్ ఆఘా 31 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఆఘా ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
పాక్ కు కొత్త షాహిద్ అఫ్రిది – హసన్ నవాజ్ పై ప్రశంసలు
హసన్ నవాజ్ విధ్వంసక బ్యాటింగ్ చూసిన క్రికెట్ పండితులు “ఇతనే పాకిస్థాన్ కు కొత్త షాహిద్ అఫ్రిది” అని ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటీవలే అరంగేట్రం చేసిన నవాజ్, విదేశీ గడ్డపై ఇంత దూకుడుగా ఆడటం విశేషం.

గతంలో షాహిద్ అఫ్రిది ఫాస్టెస్ట్ సెంచరీతో సంచలనం సృష్టించి, ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్నాడు. ఇప్పుడు హసన్ నవాజ్ కూడా అదే తరహాలో మెరుపు బ్యాటింగ్ తో తన ప్రతిభను నిరూపించుకున్నాడు.పాక్ జట్టు ఇటీవల వరుస ఓటములతో కుంగిపోయినా, హసన్ నవాజ్ విజృంభణతో న్యూజిలాండ్ పై గెలిచి గౌరవాన్ని నిలబెట్టుకుంది. ఈ యువ ఆటగాడు భవిష్యత్తులో పాకిస్థాన్ జట్టు పునరుజ్జీవనానికి నాంది కావొచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

HasanNawazCentury HasanNawazVsNZ NewZealandTour PakCricketVictory PakistanVsNewZealand ShahidAfridiSuccessor T20Cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.