హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన సీనియర్ నేషనల్ విమెన్స్ కబడ్డీ చాంపియన్‌షిప్ (National Kabaddi Championship) ఫైనల్ మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. ఈ కీలక పోరులో హర్యానా జట్టు 39–37 తేడాతో రైల్వేస్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. రెండు జట్ల మధ్య పోటీ తీవ్రంగా సాగడంతో ప్రేక్షకులు చివరి విజిల్ వరకు ఉత్కంఠతోనే మ్యాచ్‌ను ఆస్వాదించారు.
Read Also: T20 World Cup: T20 నుంచి బంగ్లా తప్పుకోవడం పై స్పందించిన సురేశ్ రైనా
టాప్ స్కోరర్
హర్యానా తరఫున నికిత 17 పాయింట్లతో, రుచి 9 పాయింట్లతో రాణించారు. రైల్వేస్ తరఫున పూజ 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. సెమీస్‌లో ఓడిన హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు కాంస్య పతకాలు సాధించాయి. విజేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ట్రోఫీలు అందజేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: