📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Harmanpreet Kaur: జైపూర్ వాక్స్ మ్యూజియంలో హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం

Author Icon By Anusha
Updated: December 3, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్, డాషింగ్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ (Harmanpreet Kaur) కు అరుదైన గౌరవం దక్కింది. రాజస్థాన్‌లోని ప్రఖ్యాత జైపూర్ వాక్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర సృష్టించబోతున్నారు.

Read Also: Temba Bavuma: దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఆసక్తికర వ్యాఖ్యలు

సుమారు గంటన్నర పాటు సమావేశం జరిగింది

ఇప్పటికే ఆమె విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి.ఈ విషయాన్ని మ్యూజియం వ్యవస్థాపకులు, క్యూరేటర్ అనూప్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇటీవల తమ బృందం హర్మన్‌ప్రీత్‌ను కలిసి, విగ్రహం తయారీకి అవసరమైన కొలతలు, ఫొటోలు, వీడియోలు తీసుకుందని తెలిపారు.

ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు సాగిందని ఆయన వివరించారు.”తన మైనపు విగ్రహం ఏర్పాటు పట్ల హర్మన్‌ప్రీత్ (Harmanpreet Kaur) చాలా ఉత్సాహం చూపించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తన కుటుంబంతో కలిసి వస్తానని చెప్పారు. మ్యూజియం యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు” అని శ్రీవాస్తవ పేర్కొన్నారు.

Harmanpreet Kaur wax statue at Jaipur Wax Museum

యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయడం

సమావేశం సందర్భంగా హర్మన్‌ప్రీత్ మ్యూజియంలోని ‘శీశ్ మహల్’ గురించి ప్రశంసించారని, మైనపు విగ్రహాల తయారీ గురించి ఆసక్తిగా తెలుసుకున్నారని ఆయన అన్నారు. యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయడమే తమ మ్యూజియం విధానమని శ్రీవాస్తవ తెలిపారు. “హర్మన్‌ప్రీత్ వ్యక్తిత్వం యువ మహిళలకు ఎంతో ఆదర్శం.

ఆమె విగ్రహం మా మ్యూజియం ప్రతిష్ఠ‌ను మరింత పెంచుతుంది. ఇక్కడ ఇప్పటికే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సైనా నెహ్వాల్, సందీప్ సింగ్ వంటి క్రీడాకారుల విగ్రహాలు ఉన్నాయి” అని ఆయన వివరించారు.

హర్మన్‌ప్రీత్ కౌర్ జాతీయ జెర్సీలో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. భారత మహిళా క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణకు, హర్మన్‌ప్రీత్ కౌర్ సాధించిన విజయాలకు ఈ గుర్తింపు ఒక నిదర్శనంగా నిలుస్తుంది.

హర్మన్‌ప్రీత్ కౌర్ ఎప్పుడు భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టులో చేరింది?

హర్మన్‌ప్రీత్ కౌర్ 2009లో భారత మహిళా క్రికెట్ జట్టులో చేరింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Harmanpreet Kaur Indian women cricket Jaipur Wax Museum latest news Telugu News Wax Statue Honor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.