📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Harmanpreet Kaur- T20: చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్!

Author Icon By Aanusha
Updated: February 20, 2026 • 12:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Harmanpreet Kaur- T20: ఆస్ట్రేలియా పర్యటనను ఘన విజయంతో ప్రారంభించిన భారత మహిళల జట్టుకు రెండో టీ20లో అనూహ్య పరాజయం ఎదురైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్‌బెర్రా వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సమష్టిగా రాణించి 19 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంగా కనిపించిన భారత జట్టు ఈసారి బ్యాటింగ్‌లో తడబడడంతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది.

Read Also: Manik Gupta: తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ హర్మన్‌ప్రీత్‌కు కెరీర్‌లో 356వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ క్రమంలో ఆమె న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్‌ను అధిగమించింది. న్యూజిలాండ్ తరఫున సుజీ బెట్స్ 355 మ్యాచ్‌లు ఆడింది. ఎల్లిస్ పెర్రీ(349), మిథాలీ రాజ్(333), చార్లోట్ ఎడ్వర్డ్స్(309) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్, ఎల్లిస్ పెర్రీ, సుజీ బేట్స్ మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నారు. మిగతా ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించారు.

189 టీ20లు

చిన్నప్పటి నుంచి క్రికెట్టే ధ్యాసగా పెరిగిన హర్మన్‌ప్రీత్, 2009లో అరంగేట్రం చేసింది. అనతికాలంలోనే మూడు ఫార్మాట్లలోనూ పాతుకుపోయింది. ఇండియా తరఫున మిథాలీ రాజ్‌( Mithali Raj)ను ఎప్పుడో అధిగమించిన హర్మన్‌ప్రీత్.. ఆస్ట్రేలియా గడ్డపై బేట్స్‌ను వెనక్కి నెట్టేసింది. ఇప్పటివరకూ ఆరు టెస్టులు, 161 వన్డేలు, 189 టీ20లు ఆడింది.  అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఎలీసా పెర్రీ (ఆస్ట్రేలియా) 349, మిథాలీ రాజ్(భారత్) 333, చార్లొట్టే ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) 309, సోఫీ డెవినె(న్యూజిలాండ్) 305 మ్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Harmanpreet Kaur- T20 latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.