Latest news: Harmanpreet Kaur: వరల్డ్ కప్ ట్రోఫీని టాటూ వేయించుకున్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్

Read Time:  1 min
 Harmanpreet Kaur
 Harmanpreet Kaur
FONT SIZE
GET APP

భారత మహిళా క్రికెట్‌ జట్టు చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచిన 2025 వన్డే ప్రపంచకప్‌ విజయాన్ని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (Harmanpreet Kaur) తన జీవితాంతం గుర్తుంచుకునే విధంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆ చారిత్రక విజయానికి గుర్తుగా ఆమె తన చేతిపై ప్రపంచకప్‌ ట్రోఫీ టాటూ వేయించుకున్నారు.

Read Also: World cup: మోదీని కలవనున్న మహిళల జట్టు.. సన్మానానికి ఏర్పాట్లు

ఈ టాటూలో కేవలం ట్రోఫీ మాత్రమే కాకుండా, గెలిచిన సంవత్సరం ‘2025’, విజయం సాధించిన పరుగుల తేడా ’52’ను కూడా చేర్చారు. తన కొత్త టాటూ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో పంచుకుంటూ, ‘ఇది నా చర్మంపై, నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. తొలిరోజు నుంచి నీకోసం ఎదురుచూశాను.

 Harmanpreet Kaur
 Harmanpreet Kaur

ఇకపై ప్రతి ఉదయం నిన్ను చూస్తూ కృతజ్ఞతతో ఉంటాను’ అని భావోద్వేగపూరిత క్యాప్షన్ రాశారు. ఈ విజయంతో, ఐసీసీ టోర్నమెంట్‌ (ICC tournament) లో జట్టును విజయపథంలో నడిపిన తొలి భారత మహిళా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) చరిత్ర సృష్టించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.