हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో కెమెరాకు చిక్కిన హార్దిక్‌ పాండ్యా.. వీడియో వైరల్

Anusha
Latest News: Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో కెమెరాకు చిక్కిన హార్దిక్‌ పాండ్యా.. వీడియో వైరల్

టీమ్‌ ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) మళ్లీ వార్తల్లోకి వచ్చారు. భార్య నటాషా స్టాంకోవిక్‌ తో విడాకుల తర్వాత హార్దిక్ వ్యక్తిగత జీవితం మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు మరోసారి ఆయన పేరు వినిపిస్తోంది. మోడల్, నటి మహియెకా శర్మ (Mahieka Sharma) తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందా? అనే ప్రశ్నతో సోషల్ మీడియాలో చర్చలు మోతెక్కుతున్నాయి.

Harmanpreet Kaur: ఓటమి పై టీమిండియా కెప్టెన్ ఏమన్నారంటే?

ఇప్పుడు పాండ్యా మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాడు. రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ (rumoured girlfriend) మహియెకాతో పాండ్యా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. తాజాగా వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌ (Mumbai airport)లో కెమెరాకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇక విడాకుల అనంతరం మహియెకాతో హార్దిక్‌ పాండ్యా కనిపించడం ఇదే తొలిసారి. దీంతో డేటింగ్‌ వార్తలు నిజమే అంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

న‌టాషా (Natasha) తో విడాకులు ప్రక‌టించిన అనంత‌రం పాండ్య బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియా (Jasmine Walia) తో కొన్నిరోజులు డేటింగ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఇది కూడా కొన్నిరోజులకే బ్రేక‌ప్ అవ్వగా.. తాజాగా మహియెకా శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వైర‌లవుతున్నాయి. మొద‌ట‌గా ఈ పుకార్లు రెడిట్ అనే సోష‌ల్ మీడియా ద్వారా ప్రారంభం అయ్యాయి.

మ‌రోవైపు ఈ వార్తల‌కు మరింత బలం

ఇందులో ఒక పోస్ట్‌లో మహియెకా షేర్ చేసిన ఒక సెల్ఫీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వ్యక్తి బ్లర్‌గా క‌నిపించాడు. అయితే అత‌డు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నే అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాకుండా మహియెకా పోస్ట్‌లలో ఎక్కడో హార్దిక్ జెర్సీ నంబర్ 33 కనిపించడాన్ని కూడా ఒక యూజర్ గుర్తించారు. మ‌రోవైపు ఈ వార్తల‌కు మరింత బలం చేకూరుస్తూ.. హార్దిక్, మహియెకా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారని అభిమానులు గమనించారు.

కొన్ని ఫోటోలలో ఇద్దరూ ఒకే రకమైన బాత్‌రోబ్ ధరించినట్లు కూడా గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను కూడా నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో బ‌య‌ట‌పెట్టారు. ఆసియా కప్ కోసం హార్దిక్ దుబాయ్‌లో ఉన్న సమయంలో మహియెకా కూడా అక్కడికి వెళ్లినట్లు వార్తలు రావడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి. ఇప్పుడు తొలిసారి ఇద్దరూ జంటగా కనిపించడం ఆ రూమర్స్‌కు బలం చేకూర్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870