📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Hardik Pandya: కెమెరామెన్‌కు హ‌గ్ ఇచ్చి సారీ చెప్పిన హార్దిక్‌

Author Icon By Aanusha
Updated: December 20, 2025 • 9:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Hardik hugged the cameraman and apologized

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి టీ20లో తన సిక్సర్ కారణంగా గాయపడిన కెమెరామెన్‌కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) క్షమాపణలు చెప్పడంతో పాటు హగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు హార్దిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Read Also: Cricket Tournament: విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రోహిత్, కోహ్లీతో భారత స్టార్ ఆటగాళ్లు సత్తా చాటేరు

అసలేం జరిగిదంటే?

ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కేవలం 25 బంతుల్లో 63 పరుగులతో చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఐదు భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అతను కొట్టిన ఓ సిక్సర్, బౌండరీ లైన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న కెమెరామెన్‌ భుజానికి బలంగా తాకింది. దీంతో అతడి భుజంపై గాయమైంది. వెంటనే స్పందించిన టీమిండియా ఫిజియో, అతనికి ప్రథమ చికిత్స అందించారు.

భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా నేరుగా ఆ కెమెరామ్యాన్ వద్దకు పరుగున వెళ్లాడు. అతని గాయాన్ని పరిశీలించి, ఐస్ ప్యాక్ పెట్టడంలో సహాయం చేశాడు. అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణగా అతడిని ఆలింగనం చేసుకుని తన పెద్ద మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, హార్దిక్ క్రీడా స్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Hardik Pandya India vs South Africa T20 latest news Narendra Modi Stadium sportsmanship Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.