📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Harbhajan Singh: షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

Author Icon By Anusha
Updated: December 5, 2025 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బుధవారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సమష్టిగా విఫలమైన భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ పరాజయంపై మాట్లాడిన హర్భజన్ సింగ్ (Harbhajan Singh).. భారత జట్టు యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. వెటరన్ పేసర్ మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోకపోవడాన్ని ఆయన ప్రశ్నించాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ షమీని పక్కనపెట్టడం సరికాదన్నాడు.

Read Also: Joe Root 40th Test century : 40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ ఐదు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీయగా, చివరి మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడిన హర్భజన్ (Harbhajan Singh) “అసలు షమీ ఎక్కడ? అతడిని ఎందుకు ఆడించడం లేదో నాకు అర్థం కావడం లేదు. ప్రసిద్ధ్ కృష్ణ మంచి బౌలరే, కానీ అతడు ఇంకా చాలా నేర్చుకోవాలి.

Harbhajan fires back at Shami not being included in the team

క్రికెట్‌లో మ్యాచ్‌లు గెలిపించే బౌలర్లు

మంచి బౌలర్లను మీరు నెమ్మదిగా పక్కనపెడుతున్నారు” అని అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేకపోవడం బౌలింగ్ విభాగాన్ని బలహీనపరుస్తోందని అభిప్రాయపడ్డాడు. బుమ్రా లేకుండా కూడా మ్యాచ్‌లు గెలవడం మనం నేర్చుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు. వైట్ బాల్ క్రికెట్‌లో మ్యాచ్‌లు గెలిపించే బౌలర్లు జట్టులో కరువయ్యారని,

ఇది పెద్ద ఆందోళన కలిగించే విషయమని భజ్జీ పేర్కొన్నారు. “ఇంగ్లండ్‌లో బుమ్రా లేనప్పుడు సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్లలో కుల్దీప్ ఉన్నాడు, కానీ మిగతావాళ్ల సంగతేంటి? వికెట్లు తీయగల స్పిన్నర్లను గుర్తించాలి. వరుణ్ చక్రవర్తిని టీ20లతో పాటు వన్డేల్లోకి కూడా తీసుకురావాలి” అని సూచించాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Harbhajan Singh Indian Cricket latest news Mohammed Shami Team India Team Management Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.