సరిహద్దుల్లో మన జవాన్లు దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అలాంటి వేళ పాకిస్థాన్‌తో క్రికెట్ (Cricket with Pakistan) ఆడటం ఎంతవరకు న్యాయమని, భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ప్రశ్నించారు.దేశ ప్రయోజనాల ముందు క్రికెట్ ఏమీ కాదు అని హర్భజన్ అన్నారు. దేశం కోసం ఎవరు త్యాగం చేస్తే, వారిని గౌరవించాలి. క్రికెట్‌ను వదిలేయడం అంత పెద్ద విషయం కాదు అని స్పష్టం చేశారు.2025 ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 14న దుబాయ్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఉంది. ఈ నేపథ్యంలో భజ్జీ తన అభిప్రాయాన్ని బలంగా వెలిబుచ్చారు.సైనికుడు తన ప్రాణాన్ని ఇచ్చి దేశాన్ని కాపాడతాడు. అలాంటి సమయంలో మనం ఒక మ్యాచ్‌ను కూడా రద్దు చేయలేమా?” అని హర్భజన్ ప్రశ్నించారు. దేశం ఉంటేనే ఆటగాడు ఉంటాడు” అని అన్నారు.
రక్తం, నీళ్లు కలిపితే ఎలా?
రక్తం, నీళ్లు కలిపితే అది పనిచేయదు. అలాగే సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు క్రికెట్ సరి కాదు అని చెప్పారు. ఇది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదు. మన ప్రభుత్వ వైఖరి కూడా ఇదే అని అన్నారు.కొద్ది వారాల క్రితం డబ్ల్యూసీఎల్ టోర్నీలో శిఖర్ ధావన్, యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్ పాకిస్థాన్‌తో ఆడేందుకు నిరాకరించారు. ఈ నిర్ణయాన్ని చాలామంది దేశభక్తిగా అభివర్ణించారు. ఇప్పుడు హర్భజన్ మాటలతో ఆ నిర్ణయం మరింత బలపడుతోంది.హర్భజన్ మీడియా తీరుపై కూడా సీరియస్‌గా స్పందించారు. “పాక్ ఆటగాళ్లు ఏమన్నా మాట్లాడితే, మనం దాన్ని చూపించకూడదు” అని చెప్పారు. “వారు వాళ్ల దేశంలో మాట్లాడటమే కానీ, మనం అందుకు ప్రాధాన్యం ఇవ్వకూడదు” అని అన్నారు.
క్రికెట్‌కు ముందు దేశ ప్రయోజనం
హర్భజన్ అభిప్రాయం ప్రకారం, క్రికెట్ కంటే దేశ గౌరవం ముఖ్యమైంది. సైనికుల త్యాగం మనం గౌరవించాలి. దేశం కోసం క్రికెట్‌కు తాత్కాలికంగా బ్రేక్ పెట్టడంలో తప్పేమీ లేదు.ఈ పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు ఓ నిజాన్ని గుర్తించాలి. మన దేశ భద్రత కంటే పెద్దది ఏదీ కాదు. క్రికెట్, సినిమా, ఎంటర్టైన్‌మెంట్ అన్నీ తర్వాతే.భారత క్రికెట్ అభిమానులు ఈ విషయాన్ని ఆలోచించాల్సిన సమయం ఇది. దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పాక్‌తో క్రికెట్‌ను బహిష్కరించాలన్న హర్భజన్ అభిప్రాయం ఓ చర్చకు దారి తీస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటీ?
Read Also :