📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

WTC Celebration : టెస్టు గ‌ద‌తో ‘గ‌న్ సెల‌బ్రేష‌న్’: బవుమా

Author Icon By Divya Vani M
Updated: June 15, 2025 • 8:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా (South Africa) జట్టు చరిత్ర సృష్టించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను (Australia) ఓడించి టైటిల్‌ గెలుచుకుంది. గెలుపుతో ‘చోకర్స్’ అనే ముద్రను చెరిపేసింది. మౌనంగా ఎదురుచూసిన 27 ఏళ్ల కల నెరవేరింది.తెంబ బవుమా తన ఆత్మవిశ్వాసంతో జట్టును నడిపించాడు. ఆటగాళ్లపై నమ్మకం పెట్టి తనదైన శైలిలో నాయకత్వం చూపించాడు. విజయం అనంతరం అతని విక్టరీ సెలబ్రేషన్‌ ఓ రేంజ్‌లో కనిపించింది.కగిసో రబడా 9 వికెట్లతో ఆట మోమెంట్‌ను మార్చాడు. ఎడెన్ మర్క్రమ్ 136 పరుగుల శతకంతో చెలరేగాడు. బవుమా కూడా 66 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టును నిలబెట్టాడు.
ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు నిడివి ఇన్నింగ్స్‌తో చీల్చి పారేశారు. పేసర్ల ధాటిని భయపడకుండా బవుమా, మర్క్రమ్ ఎదుర్కొన్నారు. వారి భాగస్వామ్యం 147 పరుగులు చేరింది.

భారత దిగ్గజాల రికార్డును చెరిపేసిన జోడీ

లార్డ్స్ మైదానంలో వీరిద్దరి భాగస్వామ్యం భారత దిగ్గజాలు అగార్కర్, వీవీఎస్‌ల రికార్డును అధిగమించింది. నాలుగో స్థానానికి నెట్టేసింది.

బవుమా గదాన్ని పైకి ఎత్తిన సందర్బం

విజయానంతరం బవుమా ఐసీసీ ఛైర్మన్ జై షా నుంచి ట్రోఫీ స్వీకరించాడు. దాన్ని చేతుల్లోకి ఎత్తి గన్ పేలుస్తున్నట్లుగా సెలబ్రేట్ చేశాడు. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.విజయం తర్వాత మర్క్రమ్ ఓ అభిమాని ఇచ్చిన బీరు తాగాడు. దాంతో అతనికి ఏం అవుతుందా? అంటూ చర్చ మొదలైంది. కానీ మర్క్రమ్ వెంటనే స్పందించాడు. బీరు ఇచ్చిన వ్యక్తి తన స్కూల్ ఫ్రెండ్ అని చెప్పాడు.ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచ క్రికెట్‌కు మరోసారి తాము సిద్ధమేనని చాటింది.

Read Also : Air India : విమానంలో సాంకేతిక సమస్య : నరకం చూసిన ప్రయాణికులు

Aden Markram century Bavuma captaincy victory ICC World Test Championship Final Lord's Test victory Safaris create history South Africa vs Australia Test

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.