📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IPL 2025 : ఈరోజు కీలక పోరు

Author Icon By Sudheer
Updated: April 21, 2025 • 6:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ (GT) మరియు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 7 మ్యాచ్లలో 5 విజయాలు సాధించిన గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ టేబుల్ టాప్‌ స్థానం నిలబెట్టుకోవాలని గుజరాత్ భావిస్తోంది. ఇంతవరకూ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడగా ఆడిన GT, తమ పట్టు వీడకుండ తుది దశకు చేరాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది.

KKR ఇప్పటివరకు 7 మ్యాచ్లలో కేవలం 3 విజయాలే

అంతేకాదు, కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 7 మ్యాచ్లలో కేవలం 3 విజయాలే నమోదు చేయగలిగింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం KKRకు ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టు మెరుగైన ప్రదర్శనతో పుంజుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌లో రాణించాల్సిన బాధ్యత వంకటేశ్ అయ్యర్, నరైన్, రస్సెల్ వంటి ఆటగాళ్లపై ఉంది. బౌలింగ్ విభాగంలో వారు గుజరాత్ బ్యాటర్లను అదుపులో ఉంచగలిగితే గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.

ఇప్పటివరకు ఇరుజట్లు 4సార్లు బరిలోకి

ఇవాళ్టి పోరు రెండు జట్లకూ కీలకమైనదిగా మారింది. ఇప్పటివరకు ఇరుజట్లు 4సార్లు తలపడగా, గుజరాత్ 2, కోల్కతా ఒక మ్యాచ్‌లో విజయం సాధించాయి. మరో మ్యాచ్ వర్ష కారణంగా రద్దైంది. ఈ నేపథ్యంలో తాజా పోరులో విజేతగా ఎవరు నిలవబోతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్‌లో చూపిస్తున్న ప్రదర్శనను బట్టి గుజరాత్ టైటాన్స్ కొంత ముందంజలో ఉన్నట్టు అనిపిస్తోంది. టాపార్డర్ బ్యాటింగ్ నిలకడగా ఉండడంతో పాటు బౌలింగ్ డెప్త్ ఉన్న గుజరాత్ ఈరోజు పోరులో స్లిట్ ఎడ్జ్ కలిగి ఉందని అంచనా. కానీ KKR ఒక్కసారిగా ఫోరంలోకి వస్తే మ్యాచ్ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

Google News in Telugu GT vs KKR match april 21 IPL 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.